English | Telugu
చరణ్ ను పక్కన పెట్టేసాడ?
Updated : Jul 22, 2013
రాంచరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమం కూడా జరుపుకున్న ఈ చిత్రం ఆగిపోయిందని టాలీవుడ్ టాక్. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఓ కథను మహేష్ కు వినిపించాడంట. అది నచ్చడంతో శివతో సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. దాంతో చరణ్ సినిమా వదిలేసి.. మహేష్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని తెలిసి.. నిర్మాత బండ్ల గణేష్ తన సన్నిహితులతో చెప్పుకుంటూ బాధపడుతున్నాడని సమాచారం.