ది గర్ల్ ఫ్రెండ్ నాలుగు రోజుల కలెక్షన్స్! పెరిగాయా, తగ్గాయా!
on Nov 11, 2025

-ది గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కలెక్షన్స్
-పాన్ ఇండియా నటిగా రష్మిక మెరుపులు
-కలెక్షన్స్ తగ్గాయా! పెరిగాయా!
తనని పాన్ ఇండియా నటీమణి అని ఎందుకు అంటారో సిల్వర్ స్క్రీన్ పై మరోసారి 'ది గర్ల్ ఫ్రెండ్'(The GirlFriend)తో చాటి చెప్పింది రష్మిక(Rashmika). భూమా అనే క్యారక్టర్ లో రష్మిక కనపర్చిన నటనకి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. కెరీర్ పరంగా చూసుకున్నా తన సినీ చాట్ లిస్ట్ లో గర్ల్ ఫ్రెండ్ మూవీ బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా సినీ పండితులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మూవీ మరో రెండో రోజుల్లో తొలి వారంలోకి అడుగుపెట్టబోతుంది.ఈ లోపు మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాల వారు ప్రకటించారు. వాళ్ళ అంచనా ప్రకారం నాలుగు రోజులకి 7 .50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా రష్మిక ప్రీవియర్స్ మూవీస్ తో పోల్చుకుంటే తక్కువే. కానీ తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కంటే వీకెండ్ రోజులు ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇక మేకర్స్ అధికారికంగా చెప్పకపోయినా గర్ల్ ఫ్రెండ్ మూవీకి సుమారు 42 కోట్ల బడ్జెట్ అయినట్టుగా టాక్. మరి టోటల్ రన్నింగ్ లో సేఫ్ జోన్ లోకి అడుగుపెడుతుందా లేదా అనే ఆసక్తి అందరిలో ఉంది.
Also Read: తమన్నా ఓజంపిక్ ఇంజెక్షన్స్ వాడుతోందా!
నూతన కథానాయకుడు దీక్షిత్ శెట్టి(Deekshit Shetty)హీరోగా విక్కీ అనే క్యారక్టర్ లో మంచి పెర్ పెరఫార్మెన్స్ నే ప్రదర్శించాడు. గర్ల్ ఫ్రెండ్ ని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)కూడా కీలక పాత్రలో కనపడ్డాడు.అను ఇమ్మానియేల్ నటన కూడా ప్రధాన ఆకర్షణ. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



