English | Telugu

హరిహర వీరమల్లు ఆర్ట్ డైరెక్టర్ కి ఫ్రాన్స్ ప్రభుత్వం గుడ్ న్యూస్  

-తోట తరణికి గుడ్ న్యూస్
-రేపు చెన్నైలో 'చెవాలియార్' బహుకరణ
-కథకి తగ్గ ఆర్ట్ పని తనం
-ఎన్నో హిట్ సినిమాలు సొంతం

దర్శక, రచయతలు అనుకున్న కథ, కథనాల్ని సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకుడు తన చూపు మరల్చుకోకుండా చెయ్యాలంటే 'ఆర్ట్ డిపార్మెంట్ పని తనం కూడా ఎంతగానో మెప్పించాల్సిందే. సీన్ పరంగా చూసుకున్నా సదరు సీన్ బాగా పండాలన్నా ఆర్ట్ పని తనం ముఖ్యమే. మరి ముఖ్యంగా కొన్ని సినిమాల విజయమైతే ఆర్ట్ డిపార్మెంట్ పైనే ఆధారపడి ఉంటాయి. అలాంటి డిపార్మెంట్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆర్ట్ డైరెక్టర్ కి కూడా అభిమానులు ఉంటారని నిరూపించిన లెజండ్రీ ఆర్ట్ డైరెక్టర్ 'తోట తరణి'(Thota Tharani).

రీసెంట్ గా తోట తరణి కి అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్(France)ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం 'చెవాలియార్'(Chevalier)కి ఎంపిక అయ్యారు. చెన్నైలోనే ఉన్న ఫ్రెంచ్ కాన్సులేట్ లో రేపు సదరు పురస్కారాన్ని అందుకోవడం జరుగుతుంది. దీంతో దక్షిణ భారతీయ సినిమా పరిశమ్రకి చెందిన పలువురు సినీ ప్రముఖులు తరణి కి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం 1957 లో 'చెవాలియార్' అవార్డుని ప్రవేశ పెట్టగా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి అవార్డు ని అందిస్తు వస్తుంది. కళాకారులు కూడా చెవాలియార్ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తారు. గతంలో ఈ అవార్డుని శివాజీ గణేశన్, కమల్ హాసన్, ఐశ్వర్య రాయ్, మంగళంపల్లి బాలమురళి కృష్ణ వంటి వారు కూడా అందుకున్నారు.

also read:వేర్ ఈజ్ ఎన్టీఆర్


కథకి తగ్గట్టుగా తన ఆర్ట్ పని తీరుతో మెప్పించడం తోట తరణి స్పెషాలిటీ. తన పని తనం వల్ల సినిమా రేంజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అర్జున్, నాయకుడు, భారతీయుడు, ఇంద్రుడు చంద్రుడు,శుభ సంకల్పం, చూడాలని ఉంది, గీతాంజలి, శివ, అతడు, రుద్రమదేవి, ఖైదీ నెంబర్ 150 ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో. రీసెంట్ గా హరిహర వీరమల్లు(Harihara Veeramallu),ఘాటీ లకి కూడా ఆర్ట్ డైరెక్టర్ గా మెప్పించారు. కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న తరణి తమిళంలో కూడా ఎన్నో హిట్ సినిమాలని అందించారు.