English | Telugu
రజనీకాంత్ నటగురువు కన్నుమూత.. రాజకీయాల్లో ఆ రోజు ఏం జరిగింది
Updated : Nov 18, 2025
-రజనీకాంత్ నట గురువు మృతి
-గోపాలి గా సుపరిచితులు
-చిరంజీవి కూడా శిక్షణ
-రజనీ నివాళులు
సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajikanth)నిర్మించుకున్న సినీ సామ్రాజ్యం గురించి తెలిసిందే. ఐదు దశాబ్దాల నుంచి ఆ నటప్రస్థానం యొక్క స్థాయి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అంతలా తన అద్భుతమైన నటనతో అభిమానులని ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడం రజనీ స్టైల్. ఇందుకు కారణం 'కెఎస్ నారాయణ స్వామి'. ఈయన ఎవరో కాదు రజనీకాంత్ కి నటనలో మెళుకువులు నేర్పిన నటగురువు. సినీ వర్గాల్లో కె ఎస్ గోపాలి(ks Gopali)అనే పేరుతో సుపరిచితులు. రజనీ కాంత్ ని దిగ్గజ దర్శకుడు బాలచందర్(Balachander)కి పరిచయం చేసింది కూడా గోపాలి నే.
నిన్న ఉదయం గోపాలి మరణించం జరిగింది. 92 సంవత్సరాల వయసు గల గోపాలి గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చే పలు అనారోగ్య ఇబ్బందులని ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యలపై ట్రీట్ మెంట్ తీసుకుంటూ కూడా వస్తున్నారు. చివరకి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడవడం జరిగింది. గోపాలి మరణ వార్త విన్నవెంటనే రజనీ కాంత్ హుటాహుటిన గోపాలి ఇంటికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించాడు. నివాళులు అర్పించిన అనంతరం తన గురువుతో ఉన్న అనుబంధం గురించి మీడియా సమక్షంగా వెల్లడి చేసాడు.
also read:బాలకృష్ణ కి ఆ స్టార్ హీరో భయపడ్డడా!
గోపాలి మరణ వార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా రజనీ అభిమానులు గతంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లోకి రావడం లేదని రజనీ ప్రకటించిన తర్వాత నేరుగా గోపాలి ని రజనీ కలిసాడు. అప్పట్లో ఈ భేటీపై పలు రకాల వార్తలు వచ్చాయని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి(Chiranjeevi),అమితాబ్ బచ్చన్, నాజర్ వంటి స్టార్స్ కి కూడా గోపాలి నటనలో మెళుకువలు చెప్పినట్టుగా తెలుస్తుంది. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కి డైరెక్టర్ గా కూడా పని చేసారు.