English | Telugu
'ఎఫ్ 3' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే.. రికవర్ అయ్యింది 54 శాతమే!
Updated : May 30, 2022
వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన 'ఎఫ్ 3' మూవీ ఫస్ట్ వీకెండ్ సంతృప్తికరమైన వసూళ్లను రాబట్టింది. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.85 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ. 11.05 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వెరసి ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి తెలుగునాట రూ. 27.55 కోట్లు, వరల్డ్‌వైడ్ రూ. 34.55 కోట్ల షేర్‌ను ఎఫ్ 3 సాధించింది. ఈ మూవీ వరల్డ్‌వైడ్ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 63.60 కోట్లు. అంటే ఇప్పటివరకూ 54.3 శాతం రికవరీ అయ్యింది.
తమన్నా, మెహ్రీన్ పిర్జాడా హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు మూడో రోజు ఆదివారం తెలంగాణలో రూ. 4.04 కోట్లు, రాయలసీమలో రూ. 1.21 కోట్లు, ఆంధ్రాలో రూ. 3.60 కోట్ల షేర్ వచ్చింది. వీకెండ్ కలెక్షన్ల విషయానికొస్తే.. తెలంగాణలో రూ. 12.20 కోట్లు, రాయలసీమలో రూ. 3.59 కోట్లు, ఆంధ్రాలో రూ. 15.36 కోట్ల షేర్‌ను 'ఎఫ్ 3' రాబట్టింది. దిల్ రాజు సొంతంగా తెలంగాణలో రిలీజ్ చేశారు. ఈ ఏరియాలో మూవీ విలువ రూ. 18 కోట్లుగా ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. దాని ప్రకారం 67.7 శాతం రికవరీ అయ్యింది. ఆంధ్రా ఏరియాలో బిజినెస్ విలువ రూ. 27.40 కోట్లు. రికవరీ అయ్యింది 56 శాతం. రాయలసీమలో ప్రి బిజినెస్ విలువ రూ. 8.40 కోట్లు. అక్కడ అతి తక్కువగా 42.7 శాతం రికవరీ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రి బిజినెస్ విలువ రూ. 53.80 కోట్లు. ఫస్ట్ వీకెండ్ రికవర్ అయ్యింది 51.2 శాతం.
ఓవరాల్‌గా చూస్తే.. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువగానే ఫస్ట్ వీకెండ్ 'ఎఫ్ 3'కి కలెక్షన్లు వచ్చాయి. రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌తో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బాగా వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. టికెట్ రేట్లు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ ఆదివారం కూడా పలు షోలు ఫుల్ కాలేదు.