English | Telugu
'అంటే సుందరానికీ' ట్రైలర్ అప్డేట్.. చూసింది చాలు, త్వరగా చెప్పు
Updated : May 30, 2022
నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడు. జూన్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
'అంటే సుందరానికీ' నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ ఆకట్టుకొని.. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. సుందర ప్రసాద్ గా నాని నవ్వులు పూయిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కి ముహూర్తం ఖరారైంది. ట్రైలర్ ను జూన్ 2న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో సినిమాలోని కీలక పాత్రధారులంతా ఏదో జరిగినట్లు ఆశ్చర్యంగా చూస్తుండగా.. రెస్టారెంట్ లో తన ఎదురుగా కూర్చొని ఉన్న నానితో " చూసింది చాలు.. అవతల నాకు చాలా పనుంది. త్వరగా చెప్పు" అని హర్షవర్ధన్ అనడంతో స్క్రీన్ మీద ట్రైలర్ రిలీజ్ డేట్ పడుతుంది.
వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నరేష్, సుహాస్, రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్, నదియా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా నికిత్ బొమ్మిరెడ్డి, ఎడిటర్ గా రవితేజ గిరజాల వర్క్ చేసున్నారు.