English | Telugu
లక్కీ మంత్ లో రానున్న నాగ్!
Updated : May 29, 2022
ఈ ఏడాది సంక్రాంతికి `బంగార్రాజు`గా పలకరించిన సీనియర్ స్టార్ కింగ్ నాగార్జున.. ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న `ద ఘోస్ట్`తో బిజీగా ఉన్నారు. ఇందులో నాగ్ కి జోడీగా హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ నటిస్తుండగా.. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని నాగ్ లక్కీ మంత్స్ లో ఒకటైన అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
ఆ వివరాల్లోకి వెళితే.. గతంలో ఇదే అక్టోబర్ మాసంలో నాగ్ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన `శివ` (1989)తో పాటు అప్పటి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన `నిన్నే పెళ్ళాడతా` (1996) కూడా రిలీజైంది. అలాగే `ప్రెసిడెంటు గారి పెళ్ళాం` (1992), `అల్లరి అల్లుడు` (1993) వంటి మాస్ ఎంటర్టైనర్స్ కూడా ఇదే నెలలో విడుదలై కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. అంతేకాదు.. నాగ్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన `శివమణి` (2003) లాంటి కాప్ డ్రామా కూడా ఇదే నెలలో ఎంటర్టైన్ చేసింది. మరి.. నాగ్ కి పలు మెమరబుల్ హిట్స్ ని అందించిన అక్టోబర్ నెలని టార్గెట్ చేసుకున్న `ద ఘోస్ట్` కూడా అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి. కాగా, త్వరలోనే `ద ఘోస్ట్` రిలీజ్ డేట్ పై క్లారిటీ రానున్నది.