English | Telugu

పెళ్లి చేసుకొని విదేశాల్లో ఉన్న సుమంత్

సుమంత్, పింకీ సావిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు". చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మోడ్రన్ అమ్మాయికి, పల్లెటూరి కుర్రాడికి మధ్య జరిగే కథాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెళ్ళికి సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ హైదరాబాద్ లో చిత్రీకరించి, కొన్ని ముఖ్య సన్నివేశాలను విదేశాలలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అదే విధంగా "మర్యాదరామన్న" వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఎస్.ఎస్.కాంచి ఈ చిత్రానికి కథను అందిస్తుండటం విశేషం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.