English | Telugu

నిత్యాకు నలుగురు హీరోలు కావాలి

"అలా మొదలైంది" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ నిత్యా మీనన్. ఈ మధ్య ఈ అమ్మడు నడించిన ప్రతి ఒక్క చిత్రం కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. దాంతో నిత్యకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మడు తాజాగా నాగ శేఖర్ దర్శకత్వంలో తెరకేక్కబోయే చిత్రానికి ఒప్పుకుంది. ఈ చిత్రం ఏకంగా నాలుగు భాషలలో తెరకెక్కనుంది. అయితే ఈ నాలుగు భాషలలో హీరోలు వేరే వేరే అయినప్పటికీ... హీరోయిన్ మాత్రం నిత్యా మీనన్ ఒక్కరే కావడం విశేషం. అయితే ఇపుడు ఈ నాలుగు భాషలలో నటించే హీరోల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న నిత్యా త్వరలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మరి.