English | Telugu

డ్యూడ్ ఓటిటి డేట్ ఇదేనా! వాళ్ళకి మాత్రం షాక్  

- డ్యూడ్ ఓటిటి డేట్ ఇదే!
- పాన్ ఇండియా హీరోగా ప్రదీప్ రంగనాథన్
- డ్యూడ్ కలెక్షన్స్
- మెస్మరైజ్ చేసే నటన

'కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ తో సంబంధం లేదు డ్యూడ్' అనే డైలాగ్ చాలా ఫేమస్. ఈ డైలాగ్ నే ఒక పాఠంగా చేసుకొని హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan).పైగా పాన్ ఇండియా స్టార్ కూడా అయ్యి కూర్చున్నాడు. అది ఎంతలా అంటే రీసెంట్ గా అక్టోబర్ 17న డ్యూడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనాలపై చాలా మంది పెదవి విరిచారు. తెలుగులోనే గతంలో వచ్చిన ఆర్య 2 ,నువ్వే కావాలి వంటి చిత్రాల కోవలనే ఉందని కూడా చెప్పారు.

రివ్యూస్ కూడా తెలుగు, తమిళంలో రెండు చోట్ల పాజిటివ్ గా రాలేదు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తు డ్యూడ్ రెండు చోట్ల రికార్డు కలెక్షన్స్ ని రాబట్టింది. మొదటి ఆరు రోజులకే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి ప్రదీప్ రంగనాథన్ కట్ అవుట్ కి ఉన్న స్టామినాని తెలియచేసింది. దీంతో ఈ మూవీ ఓటిటి వేదికగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓటిటి మూవీ లవర్స్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఫిలింసర్కిల్స్ లో రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం నవంబర్ 14 నుంచి డ్యూడ్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓటిటి హక్కులని పొందిన నెట్ ఫ్లిక్స్(Netflix)మాత్రం అధికారకంగా డేట్ ని వెల్లడి చెయ్యలేదు.

Also read: అసలు ఈ భీమ్స్ ఎవరు!.. చనిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది

మరి త్వరలోనే అధికారంగా నవంబర్ 14 డేట్ ని వెల్లడి చేస్తుందా? లేక ఇంకా ముందే తీసుకొస్తుందా? లేక లేట్ గా వస్తుందా? వంటి పలు ప్రశ్నలకి సమాధానం మరికొన్ని రోజులు అయితే గాని తెలియదు. ప్రస్థుతానికి థియేటర్స్ లో అయితే డ్యూడ్ హవా తగ్గిందనే చెప్పాలి. ఒక మోస్తరు కలెక్షన్స్ ని మాత్రమే రాబడుతున్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. డ్యూడ్ లోని క్యారక్టర్ ల విషయానికి వస్తే గగన్, కుందన అనే క్యారెక్టర్ లలో ప్రదీప్ రంగనాథన్, మమిత భైజు(Mamiha Bhaiju)పోటాపోటీగా నటించారు.ఈ రెండు క్యారక్టర్స్ మధ్య ఉన్న ట్విస్ట్ నే డ్యూడ్ కథలో పెద్ద ట్విస్ట్. కుందన తండ్రిగా చేసిన శరత్ కుమార్ కూడా తన నటనతో మెస్మరైజ్ చేసాడు. ఈ ముగ్గురి మధ్యే చిత్ర కథ మొత్తం తిరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నిర్మించగా కీర్తిశ్వరన్(Keerthiswaran)దర్శకుడు. సాయి అభ్యంకార్ మ్యూజిక్ కూడా బాగానే అలరిస్తుంది.