English | Telugu

మెగా హీరోలని విజయ్ దేవరకొండ ఢీ కొట్టబోతున్నాడా! అభిమానులు ఏమంటున్నారు 

- మెగా హీరోలతో విజయ్ దేవరకొండ ఢీ
- రౌడీ జనార్దన్ రిలీజ్ డేట్
- రవికిరణ్ కోలా మూవీ కథ ఏంటి?
- మహారాష్ట్ర లో షూటింగ్

సినిమా విజయాన్నిబట్టి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని బట్టి ఒక హీరో రేంజ్ పెరుగుతుంటుంది. దీంతో హీరో తదుపరి చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఇది ఒక హీరో ఇమేజ్ కి సంబంధించి రెగ్యులర్ గా జరిగే ఫార్మేట్. కానీ సరైన హిట్ పడి చాలా కాలం అవుతున్నా కొంత మంది హీరోల క్రేజ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి ఒక హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). వరుస ఫెయిల్యూర్స్ ఎదురైనా ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకపోవడమే ఇందుకు నిదర్శనం. తెలుగు సినిమా రంగానికి దొరికిన మరో అద్భుతమైన హీరో అని కూడా చెప్పుకోవచ్చు.


రవికిరణ్ కోలా(Ravikiran Kola)దర్శకత్వంలో విజయ్ కొత్త చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. కీర్తిసురేష్(Keerthi Suresh)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు(Dil Raju)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఒక తీర ప్రాంతంలో జరుగుతుంది. యాక్షన్, రొమాన్స్, గ్రామీణ రాజకీయాల మేళవింపుతో కూడిన పక్కా మాస్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. 'రౌడీ జనార్దన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కి థియేటర్స్ కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డేట్ ని ఇంకా అధికారకంగా ప్రకటించకపోయినా, సమ్మర్ కి రావడం ఖాయమని సమాచారం.

మరి సమ్మర్ కే చిరంజీవి(Chiranjeevi) నుంచి విశ్వంభర, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు వస్తున్నాయి. రామ్ చరణ్(Ram Charan)మార్చి 27 న 'పెద్ది' తో వస్తున్నాడు. కాబట్టి చిరు, పవన్ లు తమ చిత్రాన్ని ఏప్రిల్ మధ్య తారీకుల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి అదే జరిగితే ఆ ఫీవర్ నెల మొత్తం ఉంటుంది.

Also Read: డ్యూడ్ ఓటిటి డేట్ ఇదేనా! వాళ్ళకి మాత్రం షాక్

ఈ నేపథ్యంలో రౌడీ జనార్దన్(Rowdy Janardhan)సమ్మర్ కి వస్తే ఎప్పుడు వస్తుంది! మే నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి. దీంతో చాలా మంది హీరోలు, మేకర్స్ తమ చిత్రాన్ని ఏప్రిల్ మిడిల్ నుంచి రిలీజ్ చేస్తారు కదా! మరి అదే జరిగితే రౌడీ జనార్దన్ గా విజయ్ మెగా హీరోలతో పోటీపడే అవసరం ఏర్పడుతుందా అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కటి మాత్రం వాస్తవం.ప్రస్తుతం చాలా చిత్రాలు అనుకున్న డేట్ కి రాకుండా ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పైకి క్యూ కడుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో పెద్ద సినిమాలు వారం వారం గ్యాప్ లో వచ్చినా ఇంకో సినిమాకి నష్టమే. విజయ్ కి అయితే మెగా హీరోల అందరితో మంచి బాండింగ్ ఉంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.