English | Telugu
వీరభద్రం అడ్వాన్స్ బుకింగ్...?
Updated : Jul 24, 2013
నాగార్జున హీరోగా దర్శకుడు వీరభద్రం తెరకెక్కిస్తున్న చిత్రం "భాయ్". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో వీరభద్రం ఓ చిత్రం తెరకెక్కించనున్నారని తెలిసింది.
ఇటీవలే వీరభద్రం చెప్పిన కథ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా బ్యానర్లో నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారట. దీనికోసం దర్శకుడు వీరభద్రంకు నిర్మాత దానయ్య అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడంట. అయితే నాగార్జున మాత్రం తన "భాయ్" చిత్రం తర్వాత నాగచైతన్యతో ఓ చిత్రం చేయాలని దర్శకుడు వీరభద్రంను కోరినట్లు తెలిసింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి వీరభద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా "రేసు గుర్రం" చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం తర్వాత వీరభద్రంతో బన్నీ చిత్రం ఉండవచ్చు. ఎందుకంటే నాగచైతన్య ప్రస్తుతం "మనం", "ఆటోనగర్ సూర్య" వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కాబట్టి వీరభద్రం తన నెక్స్ట్ చిత్రం అల్లు అర్జున్ తోనేనని అర్థం అవుతుంది.