English | Telugu

బి.గోపాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా, తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న దర్శకుడు బి.గోపాల్. "అసెంబ్లీ రౌడీ","సమరసింహారెడ్డి", "నరసింహనాయుడు","ఇంద్ర" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి, తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టారు. అలాంటి దర్శకుడు బి.గోపాల్ యొక్క పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.

బి.గోపాల్ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఓ కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ హీరోగా ఓ పవర్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. బాలయ్య గత చిత్రాలను అధిగమించే విధంగా ఉండబోతుందట. మరి ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.