English | Telugu

సోనూసూద్ ని కొట్టిన నాగార్జున

నాగార్జున హీరోగా నటిస్తున్న "భాయ్" చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో సోనూసూద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నారు.