English | Telugu

మందు కొడుతున్న కళ్యాణ్

"ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిందే" వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "కొరియర్ బాయ్ కళ్యాణ్". రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యామి గౌతమి హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ పార్టీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని, ఇది "లచ్చమ్మ","డింగ్ డింగ్" పాటల కంటే సూపర్ గా ఉంటుందని నితిన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

"విస్కి తోటి గుండె సాఫు...

బ్రాండి కొట్టు బి.పి.నాపు...

వొంటి కలర్ పెంచు వైను...

బొజ్జ పెంచు బీర్ కాను..." అనే విధంగా ఈ పాట ఉంటుందని నితిన్ తెలియజేశాడు. ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.