English | Telugu

'బాహుబలి ది ఎపిక్' యూఎస్ రివ్యూ.. ఇలా ఉందేంటి పరిస్థితి?

- ప్రేక్షకుల ముందుకు 'బాహుబలి ది ఎపిక్'
- యూఎస్ ప్రీమియర్ టాక్ ఏంటి?
- వంద కోట్ల గ్రాస్ సాధ్యమేనా?

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు రెండు భాగాలు కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ఒక సినిమాగా రీ-రిలీజ్ అవుతోంది. ఇండియాలో అక్టోబర్ 31న విడుదలవుతుండగా.. ఓవర్సీసీ లో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. (Baahubali The Epic)

బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు ఐదున్నర గంటల నిడివి. దానిని ఏకంగా 3 గంటల 45 నిమిషాలకు కుదించడంతో 'బాహుబలి ది ఎపిక్'పై అందరిలో ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ.. యూఎస్ ప్రీమియర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇది రీ-రిలీజ్ లా లేదని ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.

ప్రభాస్-తమన్నా లవ్ సీన్స్, కొన్ని సాంగ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ ని ట్రిమ్ చేయడంతో.. సినిమా వేగంగా పరుగెత్తింది. అలా అని స్టోరీ సోల్ కానీ, ఎమోషన్ కానీ ఎక్కడా మిస్ అవ్వలేదు. ప్రేక్షకులను కథలో మరింత ఇన్వాల్వ్ చేయడం కోసం.. అక్కడక్కడా వాయిస్ ఓవర్ జోడించడం కూడా బాగుందని చెబుతున్నారు. ప్రధాన పాత్రల మధ్య డ్రామాని బిల్డ్ చేస్తూ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపిస్తూ.. ఎడిట్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

Also Read: అప్పుల్లో దర్శకధీరుడు రాజమౌళి..?

బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది. ఇప్పటికే చాలాసార్లు చూసుంటాం. అయినప్పటికీ 'బాహుబలి ది ఎపిక్' ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ, థ్రిల్ ని పంచుతుందని.. ఇది ఖచ్చితంగా మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఆస్వాదించాల్సిన చిత్రమని.. ప్రీమియర్స్ చూసిన వారంతా చెబుతుండటం విశేషం.

రీ-రిలీజ్ లో రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన మొట్టమొదటి సినిమాగా 'బాహుబలి' నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అసలే ప్రేక్షకులు 'బాహుబలి ది ఎపిక్' కోసం ఓ కొత్త సినిమాలా ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. వంద కోట్లు ఏంటి, అంతకుమించి వసూళ్ళు రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.