English | Telugu
అప్పుల్లో దర్శకధీరుడు రాజమౌళి..?
Updated : Oct 29, 2025
టాప్ డైరెక్టర్ రాజమౌళికి అప్పులా..!
ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. ఆయన రెమ్యూనరేషన్ పాన్ ఇండియా స్టార్ హీరోల రేంజ్ లో ఉంటుంది. అలాంటి రాజమౌళికి అప్పులు ఉన్నాయనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా, ఈ విషయాన్ని ప్రభాస్ రివీల్ చేయడం విశేషం.
బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒక సినిమాగా అక్టోబర్ 31న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి, ప్రభాస్, రానా ముచ్చటించిన ప్రత్యేక ఇంటర్వ్యూను తాజాగా విడుదల చేశారు.
Also Read: బాహుబలి-3 సర్ ప్రైజ్.. రాజమౌళి కీలక ప్రకటన!
బాహుబలి-1 విడుదల రోజు నెగటివ్ టాక్ రావడంతో రాజమౌళి ఎంతో టెన్షన్ పడ్డారట. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. "నేను డైరెక్టర్ ని. నేనేమి డబ్బులు పెట్టినవాడిని కాదు. కానీ, నన్ను నమ్మి డబ్బులు పెట్టిన శోభు గారు, చిన్న గారి పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డాను. వాళ్ళకి ఏమైనా చేద్దామంటే నా వెనుక ఆస్తులు కూడా లేవు. సెకండ్ పార్ట్ ని తక్కువ బడ్జెట్ లో, తక్కువ టైంలో పూర్తి చేద్దామని కూడా ఆలోచించాను." అని రాజమౌళి అన్నారు.
రాజమౌళి మాటలకు వెంటనే స్పందించిన ప్రభాస్.. "ఆస్తులేమీ లేవు సార్ దగ్గర. మొన్నటిదాకా అప్పులు కట్టుకుంటూ ఉన్నారు. ఈయన స్టోరీలు నాకు తెలుసు." అని చెప్పాడు. దీంతో ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.