English | Telugu
ట్రెండ్ సెట్ చేసిన పవర్ స్టార్
Updated : Jul 20, 2013
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 రోజుల వేడుక చేయటం ఎలాగో సాధ్యం కావటం లేదని ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా, బాగా హడావిడితో చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రెండ్ ఫాలో అవకుండా కొత్త ట్రెండ్ ను సెట్ చేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో అతిరధ మహారధులు, సినిమా ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వారిని ఎవరిని కూడా పిలవకుండా... కేవలం ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన సాంకేతిక నిపుణులతో మాత్రమే ఈ ఆడియో వేడుక కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ సినిమాలో తనకు అత్తగా నటించిన నదియాతో ఆడియో విడుదల చేయించి సమంతకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ చిత్ర ట్రైలర్ ను బ్రహ్మానందం విడుదల చేసారు. అదే విధంగా ఈ చిత్ర ఆడియో లోగో ను చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ విడుదల చేసారు. ఈ విధంగా సినిమాలో పనిచేసిన వారితో మాత్రమే ఈ ఆడియో విడుదల కార్యక్రమం నడిపించారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఫంక్షన్ లో యాంకర్ ను కూడా ఈ సినిమాలో నటించిన ప్రదీప్, అలీ లు మాత్రమే చేసారు. పవన్ మనుషులకు ఎంత గౌరవం ఇస్తాడో, అతని సింప్లిసిటీ ఏంటో మరోసారి రుజువయ్యింది.
ఈ ఆడియో వేడుకలో అభిమానులను ఉద్దేశించి పవన్ చాలాసేపు మాట్లాడాడు. అదే విధంగా ఫాన్స్ కోసం ఓ డైలాగ్ కూడా చెప్పడంతో పవన్ అభిమానులు మొత్తం ఫుల్ ఖుషిలో ఉన్నారు.