English | Telugu

ఆపరేషన్ చేయించుకోనున్న సునీల్

కమెడియన్ నుండి హీరోగా మరి తన నటనతోనే కాకుండా తన డాన్సులతో ఆదరగొడుతూ, నేటి యువ హీరోలకు సైతం పోటీనిస్తున్న ఏకైక నటుడు సునీల్. అయితే నటన పరంగా ప్రేక్షకులకు దగ్గరయిన సునీల్.. తన డాన్సులతో అభిమానుల్ని సైతం సంపాదించుకున్నాడు. అయితే తన అరికాలు ప్రాంతంలో కాస్త ఇబ్బందిగా ఉండటంతో.. వైద్యుల సూచనా మేరకు ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం బి.జయ దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకేక్కబోయే చిత్ర షూటింగ్ ఆపరేషన్ తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.