English | Telugu
ఇలియానాపై అశ్వనీదత్ ఫిర్యాదు
Updated : Apr 7, 2011
ఈ విషయంపై ఇలియానాని కాంటాక్ట్ చేద్దామంటే ఆమె సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుంది. అయినా అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు... ఫ్లాపయిన సినిమాకు పబ్లిసిటీ ఎందుకు దండగ. ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. అశ్వనీదత్ గారికి మీడియా అంటే ఎప్పుడూ చాలా చిన్నచూపు. విషయం ఆయన నిర్మించిన అనేక చిత్రాలు విడుదలైన సందర్భంగా రుజువయ్యింది. మరి ఇప్పుడు ఈ "శక్తి" చిత్రం విషయంలో మాత్రం దత్తు గారికి మీడియా మీద ఎక్కడలేని ప్రేమ పోంగుకొస్తోంది. అందుకనే రేపు ఫిలిం ఛాంబర్ లో మీడియాను సకుటుంబంగా తన "శక్తి" సినిమా చూసేందుకు, విందు గుడిచేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీని భావమేమి తిరుమలేశ.