English | Telugu
యానిమల్ మూవీ ఫస్ట్ రివ్యూ.. అనుకున్నంత లేదు!
Updated : Nov 30, 2023
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకుడు కావడంతో తెలుగునాట కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగాయి. నేడు(డిసెంబర్ 1) యానిమల్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల మొదటి షోలు పూర్తయ్యాయి. నిడివి ఎక్కువగా ఉండటం, స్లో నేరేషన్ మైనస్ అయినప్పటికీ ఓవరాల్ గా మూవీ బాగానే ఉంది అంటున్నారు.
కొంచెం అర్జున్ రెడ్డిని పోలి ఉన్నప్పటికీ, రణబీర్ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారట. మిగతా క్యారెక్టర్స్ ను కూడా రాసుకున్న తీరు బాగుందని, ఫస్టాఫ్ లో సందీప్ మార్క్ కనిపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందట. అయితే సెకండాఫ్ లో సినిమా గాడి తప్పిందట. మళ్ళీ క్లైమాక్స్ మాత్రం బాగుందట. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్ ప్లస్ అని చెబుతున్నారు. యానిమల్ మూవీ నిడివి 203 నిమిషాలు. అదే ఈ సినిమాకి మెయిన్ మైనస్ అని తెలుస్తోంది. నిడివి ఎక్కువ, స్లో నేరేషన్, కొన్ని ఫోర్స్ డ్ సీన్స్ వంటి మైనస్ లు ఉన్నప్పటికీ, యాక్షన్ ప్రియులకు యానిమల్ కొత్త అనుభూతిని ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.