English | Telugu

తన మంచి మనసును మరోసారి చాటుకున్న అల్లు అర్జున్‌!

‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్‌ ఫైర్‌ ఏమిటో మనం చూశాం. నిజానికి స్క్రీన్‌పై అలా కనిపించే బన్ని నిజజీవితంలో ఎంతో కూల్‌ గోయింగ్‌ అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సొసైటీలోని చాలా విషయాల గురించి బన్ని స్పందించడం మనం చూస్తూనే ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో సైతం బన్నికి వీరాభిమానులు ఉన్నారంటే అందుకు కారణం అతని కామ్‌ గోయింగేనని వేరే చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ నవంబర్‌ 30న తెలంగాణలో ఎన్నికలు కావడంతో షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌ పోలింగ్‌ బూత్‌లో అందరితోపాటు క్యూలో నిలబడి ఓటు వేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతోపాటు ఇప్పుడు మరో వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

బన్ని మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే అశ్విని అనే అమ్మాయి కోసం ఓ స్పెషల్‌ సెల్ఫీ వీడియో చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌కి ఫాలోవర్స్‌ పెరిగేలా ఓ వీడియో చెయ్యమని బన్నిని అడగడంతో తాను స్టార్‌ని అనే గర్వం లేకుండా ఎంతో మంచి మనసుతో ఆమె కోసం వీడియో చేశాడు. వీడియోలో బన్ని ఆ అమ్మాయితో మాట్లాడుతూ ‘నీకు ఎంత మంది ఫాలోవర్స్‌ కావాలి.. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు?’ అని ఆమెను అడిగాడు. దానికి ఆమె ‘13కె ఉన్నారు’ అని చెప్పింది. ‘ఇప్పుడు ఎంత మంది ఫాలోవర్స్‌ కావాలి’ అని అడిగితే ‘30కె’ అని చెప్పిందా అమ్మాయి. ‘ఈ వీడియోతో వస్తారా? రావాలని కోరుకుందాం’ అంటూ చేసిన వీడియో క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. క్రమంగా అశ్విని ఫాలోవర్స్‌ పెరుగుతున్నారు. మరి బన్ని చెబితే ఫ్యాన్స్‌ ఆగుతారా. ఆమెను ఫాలో అవ్వడంతోపాటు బన్నిని అభినందిస్తూ అల్లు అర్జున్‌ గోల్డ్‌ అని, అన్నయ్య బంగారం అని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.