English | Telugu
'ఆంధ్ర కింగ్ తాలూకా' బిజినెస్.. హిట్ కొట్టాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!
Updated : Nov 26, 2025
'ఆంధ్ర కింగ్ తాలూకా' థియేట్రికల్ బిజినెస్
రామ్ గత మూడు సినిమాల కంటే తక్కువే
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?
మాస్ జపం చేసి, గత మూడు సినిమాలతో నిరాశపరిచిన హీరో రామ్ పోతినేని.. ఇప్పుడు రూట్ మార్చి, 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. ఎన్ని కోట్ల షేర్ రాబట్టాలో తెలుసా? (Andhra King Taluka)
'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.22 కోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.9 కోట్లు, సీడెడ్ లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2 కోట్లు, ఓవర్సీస్ లో రూ.3.10 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.27.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రూ.28 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.
Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ రివ్యూ!
రామ్ గత మూడు సినిమాలు యావరేజ్ గా రూ.43 కోట్ల బిజినెస్ చేశాయి. వాటితో పోలిస్తే 'ఆంధ్ర కింగ్ తాలూకా' బిజినెస్ తక్కువే. అయితే ప్రస్తుతం రామ్ ట్రాక్ రికార్డు, ఈ సినిమా జానర్ ని బట్టి చూస్తే.. ఇది మంచి బిజినెస్ చేసినట్టే లెక్క.
అభిమాని బయోపిక్ గా, ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యే స్టోరీతో వస్తుంది కనుక.. పాజిటివ్ టాక్ వస్తే 'ఆంధ్ర కింగ్ తాలూకా' రూ.28 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. మరి ఈ సినిమాతో రామ్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.