English | Telugu
ఆర్ధికంగా దివాలా తీశానని విశాల్ ప్రకటించబోతున్నాడా! అభిమానుల్లో కలవరపాటు
Updated : Nov 26, 2025
-విశాల్ కి షాక్ ఇచ్చిన కోర్టు
-దివాళా తీశానని చెప్తాడా!
-కోర్టు తీర్పు వెనక ఉన్న కథ ఏంటి?
-మరి అప్ కమింగ్ సినిమా పరిస్థితి
-సాయి ధన్సిక తో పెళ్లి ఎప్పుడు!
విశాల్(Vishal)కి ఉన్న సినీ చరిష్మా తెలిసిందే. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన విశాల్ రెండు దశాబ్డల నుంచి తన ఇమేజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై విశాల్ ప్రదర్శించే నటనకి అభిమానులు, ప్రేక్షకులు అంతలా ముగ్ధులైపోతారు. రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక(sai dhanshika)తో ఎంగేజ్మెంట్ జరగడంతో పెళ్లి డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా విశాల్ కి సంబంధించి కోర్టు వ్యాఖ్యానించిన మాటలు అభిమానులని కలవరపాటుకి గురి చేస్తున్నాయి.
విశాల్ కి ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా(Lyca)ప్రొడక్షన్ కి మధ్య సినిమా పంపిణి హక్కుల కి సంబంధించిన విషయంలో ఆర్థిక పరమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి.ఈ క్రమంలో లైకా
సంస్థ నష్టపరిహారాన్ని కోరుతురెండున్నర సంవత్సరాల క్రితం కోర్టులో పిటిషన్ వేసింది. పరిలించిన కోర్ట్ లైకా కి 30 శాతం వడ్డీ తో 21 . 29 కోట్ల రూపాయలని విశాల్ చెల్లించాలని జూన్ లో తీర్పుని ప్రకటించింది. ఆ తీర్పుని సవాలు చేస్తు విశాల్ హైకోర్టులో అప్పీల్ చేసాడు.
రీసెంట్ గా ఈ కేసు విచారణకి వచ్చింది. న్యాయమూర్తి తో విశాల్ తరుపు న్యాయవాదులు మాట్లాడుతూ 'మా క్లయింట్ విశాల్ ధనవంతుడు కాదు.డబ్బు చెల్లించలేడని తెలిపారు. సదరు వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తు 'అయితే విశాల్ దివాళా తీసాడని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా! కోట్ల రూపాయల ఆర్ధిక లావాదేవీల విషయంలో కేసు జరుగుతుంటే ధనవంతుడు కాదని చెప్పడం ఏంటని కోర్టు మండిపడింది. అదే సమయంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తు విశాల్ 10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
Also Read:రాముడిగా చేస్తు నాన్ వెజ్ తింటావా!. రణబీర్ పై నెటిజన్స్ ఫైర్
ప్రముఖ సినీ ఫైనాన్షియర్, నిర్మాత అన్బుచెళియన్ దగ్గర విశాల్ 21 కోట్ల రూపాయిల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ రుణాన్ని విశాల్ తరుపున లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. ఆ సమయంలో విశాల్ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని అగ్రిమెంట్ కూడా చేసుకుంది. కానీ విశాల్ అగ్రిమెంట్ కి వ్యతిరేకంగా రైట్స్‌ని లైకాకు ఇవ్వకపోగా తనే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు.
రుణాన్ని కూడా చెల్లించలేదు. విశాల్ ప్రస్తుతం‘మకుటం’ అనే మూవీ చేస్తున్నాడు. దర్శకుడు కూడా తనే. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మకుటం పై ఆసక్తి నెలకొని ఉంది. హిట్ చిత్రాలకి బాండ్ అంబాసిడర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తుండంతో ఆ ఆసక్తి మరింతగా పెరిగింది.