English | Telugu

శ్రీదేవి బయోపిక్ లో ఈ స్టార్ హీరోయిన్ ఓకేనా! మరి బోనీకపూర్ ఏమంటాడో

-శ్రీదేవి అంటేనే ఒక బ్రాండ్
-ఆ హీరోయిన్ మెప్పిస్తుందా!
-నా జీవిత లక్ష్యం అదే
-బోనీ కపూర్ ఏమంటాడో!


ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హీరోలే కాదు హీరోయిన్స్ కూడా తమకంటూ ఒక బ్రాండ్ ని సృష్టించుకుంటారు. అటువంటి బ్రాండ్ ని సృషించుకున్న వాళ్ళల్లో అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi)కూడా ఒకరు. సినిమా కోసం శ్రీదేవి పుట్టిందా లేక శ్రీదేవి కోసం సినిమా పుట్టిందా అని కూడా ఆమె చేసిన చిత్రాలు చూస్తుంటే అనిపిస్తుంటుంది. మంచు పర్వతంపై నిలబడిన వాళ్ళు సైతం నిండు చందమామ ఒడిలో ఉన్నట్టుగా ఫీలవ్వడం శ్రీదేవి నటనకి ఉన్నస్టైల్.


ఇక చాలా కాలం నుంచి శ్రీదేవి బయోపిక్ లో నటించాలనే కోరికని ఎంతో మంది నటీమణులు వ్యక్తం చేస్తు వస్తున్నారు. ఈ కోవలోనే రీసెంట్ గా తమన్నా(Tamannaah)మాట్లాడుతు ఒకే ఒక్క బయోపిక్ లో నటించే అవకాశం వస్తే శ్రీదేవి క్యారక్టర్ ఎంచుకుంటా. ఎందుకంటే నేను చిన్నపట్నుంచి శ్రీదేవి ని ఆరాదిస్తూ పెరిగాను. ఆమె స్టైల్, ఎక్స్ ప్రెషన్, స్క్రీన్ ప్రెజెన్స్ నాకు ఇన్స్పిరేషన్.శ్రీదేవి క్యారక్టర్ లో కనపడాలనేదే నా లైఫ్ యాంబిషన్ అని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు తమన్నా కోరిక నెరవేరాలనే కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం శ్రీదేవి భర్త బోనీకపూర్ గతంలో చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు.

also read:ఆర్ధికంగా దివాలా తీశానని విశాల్ ప్రకటించబోతున్నాడా! అభిమానుల్లో కలవరపాటు

శ్రీదేవి బయోపిక్ పై చాలా ఇంటర్వూస్ లో బోనీకపూర్(Boney kapoor)మాట్లాడుతు 'శ్రీదేవి వ్యక్తిగత జీవితం గురించి సినిమా చెయ్యడానికి అనుమతి ఇవ్వనని ప్రకటించాడు. దీంతో చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. మరి ఈ లెక్కన తమన్నా నీ కోరిక నెరవేరాలంటే బోణీ కపూర్ పర్మిషన్ ఇవ్వాలనే కామెంట్స్ చేస్తున్నారు.