English | Telugu

'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఫస్ట్ రివ్యూ!

మరికొద్ది గంటల్లో 'ఆంధ్ర కింగ్ తాలూకా'
ఫస్ట్ రివ్యూ పాజిటివ్ గానే ఉందా?
రామ్ ఖాతాలో హిట్ పడుతుందా?

ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని, ఈ వారం 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిమాని బయోపిక్ గా పి.మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ రేపు(నవంబర్ 27) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ రివ్యూ కూడా పాజిటివ్ గానే ఉంది. (Andhra King Taluka)

'ఆంధ్ర కింగ్ తాలూకా' సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఇప్పటికే మూవీ టీంతో పాటు, సన్నిహిత వర్గాలు ఈ సినిమా చూసినట్లు సమాచారం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట.

Also Read: చరిత్ర సృష్టించడానికి సై అంటున్న బాలయ్య!

చాలారోజుల పాటు గుర్తుంచుకునే.. ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ లా 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఉందని చెబుతున్నారు. ప్రచార చిత్రాలలో చూపించినట్టుగా హీరోపై ఫ్యాన్ చూపించే అభిమానం ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అయ్యేలా ఉందట. అలాగే, ఇందులో తండ్రీకొడుకుల ట్రాక్ ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచిందని అంటున్నారు.

రామ్, భాగ్యశ్రీ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయట. సున్నితమైన భావోద్వేగాలతో దర్శకుడు మహేష్ కథను నడిపిన తీరు కట్టిపడేసిందట. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు హృదయాన్ని హత్తుకునేలా ఉందనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై మంచి బజ్ ఉంది. ఇక ఇప్పుడు సెన్సార్ నుంచి, సన్నిహితుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. థియేటర్లలో కూడా ఇదే టాక్ వస్తే.. రామ్ ఖాతాలో హిట్ పడినట్లే. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.