English | Telugu

రాముడిగా చేస్తు నాన్ వెజ్ తింటావా!. రణబీర్ పై నెటిజన్స్ ఫైర్   


-రణబీర్ ఏం చేసాడు?
-భారతీయులు గర్వపడే సినిమా
-నెటిజెన్స్ ఫైర్
-బడ్జెట్ 4000 కోట్లు

భారతీయులతో పాటు రామ భక్తులందరు సగర్వంగా తలెత్తుకొని ఇది మా మూవీ అని ప్రపంచ సినిమాకి చెప్పుకునే విధంగా 'రామాయణ'(Ramayana)తెరకెక్కుతుంది. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా బడ్జెట్ సుమారు 4000 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి రామాయణ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. రాముడు గా రణబీర్ కపూర్(Ranbir kapoor),సీతమ్మ తల్లిగా సాయిపల్లవి(saipallavi)తమ ప్రాణం పెట్టి చేస్తున్నారు. రామాయణ కోసం చిత్ర యూనిట్ లో చాలా మంది తమ వ్యక్తిగత అలవాట్లని మార్చుకుంటున్నామని కూడా ప్రకటించారు.

ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం రణబీర్ కి చెందిన పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు రాముడి పాత్ర చేస్తున్న దగ్గర్నుంచి రణబీర్ సర్ నాన్ వెజ్, సిగరెట్, ఆల్కహాల్ అన్నీ ఆపేసారు. సాట్విక్ ఫుడ్, యోగా, మెడిటేషన్‌తో చాలా పద్దతిగా ఉంటున్నారని ప్రకటించింది. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్,రామభక్తులు రణ్​బీర్​ని మెచ్చుకున్నారు. కానీ రీసెంట్ గా 'డైనింగ్ విత్ ది కపూర్స్’ డాక్యుమెంటరీ కి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చింది.

సదరు వీడియోలో రణబీర్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. నీతూ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రీమా జైన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫిష్ కర్రీ, రైస్, జంగిల్ మటన్, పాయా వంటి వాటిని రణబీర్ సోదరుడు అర్మాన్ జైన్ సర్వ్ చేస్తుంటే అందరూ తింటూ ఉన్నారు.

also read:పెద్దిలో జాన్వీ కపూర్ కి డూప్ ని పెట్టారా!.. బాంధవి శ్రీధర్ ఎవరు

ఇప్పుడు ఈ వీడియో నెటిజన్స్ కంటపడటంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు రాముడిగా చేస్తు మటన్ తింటావా? సాట్విక్ డైట్ అనేది అబద్ధమేనా?అని నెటిజన్స్​ మండిపడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో #RanbirHypocrisy,#RamayanaControversy లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.మరి ఈ విషయంపై రణ్​బీర్​ టీమ్​ ఏ వివరణ ఇస్తుందో చూడాలి. వచ్చే ఏడాది దివాలి కానుకగా మొదటి భాగం, ఆ పై ఏడాది దివాలి కి రెండవ భాగం విడుదల కానున్నాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ 'యష్'(Yash)రావణుడిగా చేస్తుండగా దంగల్ మూవీ ఫేమ్ నితీష్ తివారి(Nitesh Tiwari)దర్శకుడు. నమిత్ మల్హోత్రా(Namit Malhotra)నిర్మాణ సారధ్యంలో ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.