English | Telugu

ముగ్గురమ్మాయిలతో 'అల్లు అర్జున్'..!

'జులాయి' సినిమా తర్వాత అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకరిగా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ హీరోయిన్లలనూ ఎంపిక చేసే పనిలో డైరెక్టర్ త్రివిక్రమ్‌ బిజీగా వున్నారట. అయితే ఈ సినిమా జనవరిలోనే మొదలు కావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 'జులాయి' చిత్ర నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, అల్లు అరవింద్‌ ఆధ్వర్యంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో ప్రక్క అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' విడుదలకు సిద్దమవుతుంది. సురేందర్‌రెడ్డి, అల్లుఅర్జున్‌ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు వున్నాయి.