English | Telugu

చిరు పాటకు మోహన్ బాబు సయ్యాట

ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన "యమలీల" చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు యముడి పాత్రలో నటించనున్నాడు. ఇందులో చిరంజీవి నటించిన "జగదేకవీరుడు అతిలోక సుందరి" చిత్రంలోని "యమహో నీ యమా యమా అందం..." అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటలో మోహన్ బాబు స్టెప్పులు వేయనున్నారు. హీరోగా ఓ కొత్త కుర్రాడు నటించనున్నాడు. సదా, నిషా కొఠారీ లు హీరోయిన్లు. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం కోసం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మంచి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.