English | Telugu

నటసింహం ఆకలి తీర్చిన 'లెజెండ్'

నటసింహం నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' రాకతో వసూళ్ళు లేక బోసిపోయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మళ్ళీ కలెక్షన్ల వర్షంతో కళకళలాడుతుంది. ఇప్పటికే ఈ సినిమా బాలయ్య గత సినిమా రికార్డులన్నిటిని చేరిపివేసింది. వీకెండ్ అయిపోయిన తరువాత కూడా 'లెజెండ్' సినిమా వసూళ్ళు ఇంకా స్టడీగానే కొనసాగుతున్నాయి. సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమా 50కోట్ల మార్క్ ను ఈజీగా అందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. తొలి నాలుగు రోజుల్లో 23కోట్ల షేర్ ను వసూళ్ళు చేసిన లెజండ్..మొదటివారానికి 30 కోట్ల మార్క్ ని అందుకుంటుందని అంటున్నారు. కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో 50కోట్ల మార్క్ ను దాటడం పెద్ద కష్టమేమి కాదు. మొత్తానికి చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేని నట సింహాన్ని 'లెజెండ్' సంతృప్తిపరిచాడు.