English | Telugu
ప్రభాస్‌తో చేయబోయే ‘స్పిరిట్’పై క్లారిటీ ఇచ్చిన సందీప్‌రెడ్డి
Updated : Nov 30, 2023
కేవలం ఒక్క సినిమాతోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్ చేరిపోయి స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చెయ్యాలని ఆసక్తి కనబరుస్తున్నారు. అతనే సందీప్‌రెడ్డి వంగా. తెలుగులో అర్జున్‌రెడ్డితో సంచలనం సృష్టించి.. ఇదే సినిమాను బాలీవుడ్‌లో కబీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తన సత్తా చాటారు సందీప్. ఇప్పుడు రణబీర్ కపూర్‌తో చేసిన యానిమల్ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి చెయ్యబోతున్న ‘స్పిరిట్’ గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చెయ్యబోతున్నట్టు కొంతకాలం క్రితమే సందీప్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి ఎనౌన్స్ చెయ్యగానే యూత్‌లో ఆ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెరిగాయి.
ఎందుకంటేతన సినిమాల్లో సందీప్ హీరోకి ఎంత ఎలివేషన్ ఇస్తాడో.. క్యారెక్టరైజేషన్ విషయంలో ఎంత విభిన్నంగా ఆలోచిస్తాడో అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరో ప్రభాస్‌ని సందీప్‌రెడ్డి ఎలా ప్రజెంట్ చేస్తాడు అనే విషయంలో ఆడియన్స్‌కి క్యూరియాసిటీ ఉంది. అయితే ఇప్పటివరకు యానిమల్ సినిమాతో బిజీగా ఉన్నాడు సందీప్. ఇక ప్రభాస్ వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అలాగే తక్కువ బడ్జెట్‌తో మారుతి చేస్తున్న సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సందీప్ చేస్తానని చెప్పిన ‘స్పిరిట్’ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. దాంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే సందేహం కూడా అందరిలోనూ వచ్చింది. యానిమల్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌లో ‘స్పిరిట్’ ప్రస్తావన వచ్చింది. దానికి సందీప్ స్పందిస్తూ ‘ప్రభాస్‌తో తప్పకుండా సినిమా ఉంది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే రోజు ఎప్పుడొస్తుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది’ అని స్పష్టం చేశాడు.