English | Telugu

అఖండ 2 నిర్మాతలకి కొత్త చిక్కులు 

ఏంటి ఆ సమస్య
దీనికి పరిష్కారం ఎలా!
ఫ్యాన్స్ పడిగాపులు

కోట్లాది మంది అభిమానులని నిరాశకి గురి చేస్తు అఖండ 2(Akhanda 2)రిలీజ్ కానీ విషయం తెలిసిందే. ఇప్పటికి చాలా మంది అభిమానులు థియేటర్స్ దగ్గర పడి గాపులు కాస్తున్నారంటే బాలయ్య పై వాళ్ళకి ఉన్న అభిమానాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎగ్జిబిటర్స్ రిలీజ్ కి ముందు తమ థియేటర్స్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు డిస్టిబ్యూటర్స్ కూడా అఖండ 2 తమని లాభాల పట్టించడం ఖాయమనే నమ్మకాన్ని పెట్టుకున్నారు.

ఇప్పుడు వారి గురించి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టికుమార్ మాట్లాడుతుఅఖండ 2 రిలీజ్ జరగకపోవడం పూర్తిగా అనుకోని విషయం. అభిమానులు. ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. నేను ఒక ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్‌గా చేస్తున్న వినతి మాత్రమే కాదు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నాతో మాట్లాడి తమ అభిప్రాయాలు, ఆందోళనలు పంచుకోవడంతో, వారి తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా వాయిదా పడటంతో పాటు, కొత్త రిలీజ్ తేదీ కూడా ఖరారు కాకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరిగాయి. వారు ఇచ్చిన మొత్తం 100 కోట్లకు పైగానే ఉండడం, ఆ మొత్తాలపై భారీ వడ్డీలు చెల్లించాల్సి రావడం వంటి కారణాల వల్ల వారికి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది. వారి పరిస్థితి, వారి బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి.


also read: akhanda 2:జై బాలయ్య అంటు థమన్ ట్వీట్ వైరల్

ఈ పరిస్థితుల్లో అమౌంట్ రిఫండ్ చేస్తే వారికి ఒక పెద్ద ఉపశమనం లభిస్తుంది. అందువల్ల, దయచేసి ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకి వారు చెల్లించిన మొత్తాన్ని రేపటిలోగా రీఫండ్ చేయాలని మనవి చేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా మన తెలుగు సినీ పరిశ్రమ ఒకటిగా నిలబడి, ఒకరికి ఒకరం తోడుగా ఉంటామనే బలమైన సందేశాన్ని అందిస్తుంది. ఇది మన సంపూర్ణ ఐక్యతని చూపించే సందర్భం కూడా అవుతుందని నట్టికుమార్ తెలిపాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.