English | Telugu

అఖండ‌2 రిలీజ్‌పై 14 రీల్స్ అధినేతల కీల‌క ప్ర‌క‌ట‌న‌

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిన భారీ సినిమా 'అఖండ 2: తాండవం' విడుదల చివరి నిమిషంలో వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని ప్రకటించారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ప్ర‌స్తావ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

"అఖండ-2 (Akhanda2) సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురావ‌డానికి మా శాయ‌శక్తులా ప్ర‌య‌త్నించాం. ఎంత కృషి చేసినా కొన్నిసార్లు మ‌న‌కు అనుకూలంగా ఫ‌లితం రాదు. కొన్నిసార్లు మ‌నం ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. దురదృష్టవశాత్తు ఇది అలాంటి సమయమే. ఈ సినిమా కోసం ప్ర‌పంప‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానులకు, సినీ ప్రియులందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాము” అని 14 రీల్స్ ప్లస్ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.