English | Telugu

‘జాజికాయ.. జాజికాయ..’ దుమ్ము రేపుతున్న ‘అఖండ2’ మాస్‌ సాంగ్‌!

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘అఖండ2’. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఆల్రెడీ హ్యాట్రిక్‌ సాధించిన బాలయ్య.. ఇప్పుడు ‘అఖండ2’తో రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు విడుదలైన అఖండ2 గ్లింప్స్‌, సాంగ్‌ ప్రేక్షకుల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన అప్‌డేట్స్‌లో అఘోరా గెటప్‌లో కనిపిస్తూ వచ్చిన బాలయ్య.. తాజాగా తన మాస్‌ లుక్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్‌ అయిన ‘అఖండ.. తాండవం’ సాంగ్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఒక డెవోషనల్‌ వైబ్రేషన్‌లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు రిలీజ్‌ అయిన రెండో పాట ‘జాజికాయ జాజికాయ..’ సాంగ్‌ దుమ్ము రేపుతోంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ బీట్‌తో ఫాస్ట్‌ నెంబర్‌గా వచ్చిన ఈ పాట థియేటర్లలో రచ్చ చేయడం ఖాయం అంటున్నారు మ్యూజిక్‌ లవర్స్‌. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ సాంగ్‌ని బ్రిజేష్‌ శాండిల్య, శ్రీయా ఘోషల్‌ ఎంతో ఎనర్జీతో పాడారు. పాటలో ఉన్న ఎనర్జీని స్క్రీన్‌పై చూపించేందుకు అద్భుతమైన స్టెప్స్‌ని కంపోజ్‌ చేశారు కొరియోగ్రాఫర్‌ భాను.

‘జాజికాయ జాజికాయ..’ సాంగ్‌లో నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్‌ అదిరిపోయే స్టెప్స్‌ వేశారు. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు ఫాస్ట్‌ బీట్‌తో సాగే ఈ పాట ఫ్యాన్స్‌కి ఒక సెలబ్రేషన్‌ అనే చెప్పాలి. యంగ్‌ హీరోలు సైతం షాక్‌ అయ్యేలా బాలయ్య వేసిన స్టెప్స్‌ థియేటర్‌లో ఆడియన్స్‌తో విజిల్స్‌ వేయిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట రిలీజ్‌ అయిన కొద్ది సేపటికే సోషల్‌ మీడియాలో హడావిడి మొదలైంది. థియేటర్లు దద్దరిల్లిపోతాయని, ఈ ఒక్క పాట చాలు సినిమా బ్లాక్‌బస్టర్‌ అనీ, బ్లాక్‌బస్టర్‌ లోడిరగ్‌ అనీ, థమన్‌ మాస్‌ బీట్‌ ఇరగదీశాడనీ.. ఇలా కామెంట్స్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు నందమూరి అభిమానులు.