English | Telugu

మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్‌!

పవన్‌కళ్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన వయొలెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చేస్తున్నారు పవన్‌. ఈ సినిమా తర్వాత పవర్‌స్టార్‌ చేయబోయే సినిమా ఏమిటి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతంగా ఉంది.

పవర్‌స్టార్‌ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ న్యూస్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతనొక్కడే, కిక్‌, రేసుగుర్రం, ఊసరవెల్లి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో పవన్‌కళ్యాణ్‌ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్‌క్యూజివ్‌ అప్‌డేట్‌ ఏమిటో చూద్దాం.

పవన్‌కళ్యాణ్‌ డేట్స్‌ దక్కించుకున్న నిర్మాత రామ్‌ తాళ్లూరి నిర్మించే ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్‌ ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు సురేందర్‌రెడ్డి. ఇంటర్వెల్‌ ముందు పవన్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ ఇచ్చి దాదాపు 50 నిమిషాల పాటు నడుస్తుంది. మార్చి నుంచి ఈ సినిమా కోసం పవన్‌కళ్యాణ్‌ డేట్స్‌ కేటాయించారు. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడు. ఆ హీరో ఎవరు అనేది నెక్స్‌ట్‌ అప్‌డేట్‌లో తెలుసుకుందాం.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.