English | Telugu

ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలి!

చిత్ర పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ వెబ్‌సైట్‌ను ఎట్టకేలకు క్లోజ్‌ చేయించారు పోలీసులు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపేందుకు చిత్ర ప్రముఖులు ఫిలిం ఛాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌భూషణ్‌, నిర్మాతలు సి.కళ్యాణ్‌, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్‌, వల్లభనేని అనిల్‌ కుమార్‌, బాపిరాజు, వీరశంకర్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘దేశం మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పైరసీ సెల్‌ను మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. ఈ పైరసీని అరికట్టేందుకు మన పోలీసులతోపాటు విదేశీ పోలీసులు కూడా సహకారం అందించారు. ఎంతో కష్టపడి ఐ బొమ్మ రవిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిశ్రమకు ఇంత నష్టం కలిగించిన రవిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలి. ఇది కడుపు మంటతో అంటున్న మాట. ప్రేక్షకులకు పైరసీ గురించి మరింత అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. దాని వల్ల చిత్ర పరిశ్రమకు ఎంత నష్టం జరుగుతుందీ అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలి’ అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘టికెట్‌ ధరలు ఎక్కువ ఉండడం వల్ల పైరసీలో సినిమాలు చూస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ, దీని వల్ల చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. క్యూబ్‌, యుఎఫ్‌ఓ ద్వారానే పైరసీ అనేది బయటికి వస్తోంది అనే విషయం అర్థమవుతోంది. కాబట్టి ఆయా సంస్థలు తమ సర్వర్లు స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇకముందు సినిమాలు బయటకు వెళితే కచ్చితంగా వారే దానికి బాధ్యత తీసుకోవాలి’ అన్నారు.

వల్లభనేని అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ఈమధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా విజయం సాధించడం లేదు. దానికి ముఖ్యమైన కారణం పైరసీ. తెలంగాణ ప్రభుత్వం పైరసీని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పైరసీ చేసేవారిని పట్టుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు టికెట్‌ ధరలు నిర్ణయించాలి. కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు రావాలంటే పైరసీని అరికట్టడం ఒక్కటే మార్గం’ అన్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.