English | Telugu
శంకర్ కూతురికి ఛాన్స్ ఇచ్చిన సూర్య
Updated : Aug 20, 2023
ఆకాశం నీ హద్దురా సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్నారు సూర్య. ఆ మూవీ డైరక్టర్‌తో రెండోసారి సినిమా చేయడానికి సిద్దమయ్యారు. సూర్య 43 అని తాత్కాలికంగా ఈ సినిమాను పిలుస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం అందిస్తున్న 100వ సినిమా ఇది. అందుకే చాలా స్పెషల్‌గా ఫీలవుతున్నారు.
సూర్య 43లో కీ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దుల్కర్. సూర్యని బ్రదర్‌గా ట్రీట్ చేస్తారు దుల్కర్. తాను సూర్యతో కలిసి సినిమా చేయబోతున్న విషయాన్ని ఇటీవల చెన్నైలోని ఎక్స్ ప్రెస్ ఎవెన్యూలో జరిగిన కింగ్ ఆఫ్ కోత ఈవెంట్‌లో చెప్పారు.
ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ హాట్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సూర్యకి జోడీగా అదితి శంకర్ నటిస్తారని టాక్. అదితి ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రాక్షసన్ అనే మరో సినిమాకు కూడా సంతకం చేశారు. సూర్య 43 ఆమె చేయబోయే ఐదవ సినిమా.
సూర్య ప్రస్తుతం కంగువ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.ఈ చిత్రంలో పది గెటప్పుల్లో కనిపిస్తారు సూర్య. కంగువ తర్వాత సుధ కొంగర సినిమా ఉంటుంది. ఆ వెంటనే వెట్రిమారన్ డైరక్షన్‌లో వాడివాసల్‌లో నటిస్తారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రాజెక్టులు చేస్తారు. వాటిలో ఒకటి రోలెక్స్, రెండోది ఇరుంబు కై మాయావి.