English | Telugu
శివకార్తికేయన్ రిపీట్ చేస్తారా?
Updated : Aug 20, 2023
కమర్షియల్‌గానూ, క్రిటికల్‌గానూ శివకార్తికేయన్ మావీరన్‌కి తమిళనాడులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన ప్రస్తుతం ఎస్‌కె21 షూటింగ్‌లో ఉన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో షూటింగ్ జరుగుతోంది. ఉలగనాయగన్ కమల్‌హాసన్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. సాయిపల్లవి, రాహుల్ బోస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ చేయబోయే సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనేది ఆ న్యూస్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తారట. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తారు. ఎ.ఆర్.మురుగదాస్ స్పైడర్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమా తర్వాత మధు, ప్రసాద్‌తో రీయూనిట్ అవుతున్నారు.
ఈ సినిమాలో శివకార్తికేయన్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తారని వినికిడి. గతంలోనూ ఒకసారి శివకార్తికేయన్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఆయన పోలీస్‌గా నటించిన కాక్కి సట్టై విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఖాకీ చొక్కా వేసుకోవడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా పూర్తయిందన్నది చెన్నై న్యూస్. అక్టోబర్‌లోగానీ, నవంబర్‌లోగానీ ఈ సినిమాకు ముహూర్తం పెట్టడానికి ప్లాన్స్ వేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ కన్‌ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు. కానీ సినిమా మాత్రం తప్పకుండా భారీ హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్.