English | Telugu

చిరంజీవి కూతురికి దక్కనిది.. నిహారికకు దక్కుతుందా?

మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. ఆమె తన కెరీర్‌ను యాంకర్‌గా స్టార్ట్‌ చేసింది. అంతకుముందు యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేసి నిర్మాతగా కూడా మారింది. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఐదు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. దాంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకుంది. కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఓటీటీలో ఓ వెబ్‌ సిరీస్‌లు కూడా చేసింది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ’, ‘హలో వరల్డ్‌’, ‘డెడ్‌ ఫిక్సల్స్‌’ వంటి వెబ్‌ సిరీస్‌ చేసి సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. తన ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ను లో బడ్జెట్‌తో కొత్తవారితో చెయ్యాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి కూతురు సుస్మిత ఇప్పటికే నిర్మాతగా రెండు సినిమాలు చేసింది. అయితే అవి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు నిహారిక కూడా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందు ట్రై చేస్తోంది. యుట్యూబ్‌లో ఇన్‌ ఫ్ల్యూయెన్సర్స్‌గా ఉన్నవారు నిహారిక సినిమాలో ఆర్టిస్ట్స్‌గా బిగ్‌స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తను నిర్మాతగా చేసిన వెబ్‌ సిరీస్‌లలో కీలక పాత్రల్లో కనిపించిన నిహారిక ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా నటించే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మెగా ఫ్యామిలీలో సుస్మితకి నిర్మాతగా సక్సెస్‌ అందుకోలేకపోయింది. ఇప్పుడు నిహారిక తన సినిమాతో సక్సెస్‌ సాధిస్తుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.