English | Telugu

హీరోలకి నిర్మాతలకి షాక్ ఇచ్చిన సీఎం  

హీరోలకి నిర్మాతలకి షాక్ ఇచ్చిన సీఎం  

Publish Date:Oct 28, 2025

  - ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి  - హీరోలు, నిర్మాతలు ఏం చేస్తారు - సినీ ఫెడరేషన్ కి రేవంత్ రెడ్డి గిఫ్ట్  ఇప్పడు నడుస్తుంది పాన్ ఇండియా ట్రెండ్. ఈ పాన్ ఇండియాట్రెండ్ లో ముందు వరుసలోఉంది మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ. ఇందుకు కారణం మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ వ్యయంతో నిర్మించడమే. మరి ఈ లెక్కన నిర్మాత ఎంత ఖర్చు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే సదరు నిర్మాతలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇస్తున్నాయి.   రీసెంట్ గా హైదరాబాద్ లో తెలుగు సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ మీటింగ్  జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకి ముఖ్య అతిదిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు సినిమా టికెట్ రేట్లు  పెంచితే నిర్మాతలకి, హీరోలకి ఆదాయం వస్తుంది. కానీ కార్మికులకి  ఎలాంటి లాభం లేదు. కాబట్టి టికెట్ రేట్స్ పెంచితే వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకి ఇవ్వాలి. ఈ మేరకు జివో ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది.   Also read: బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ!  
Will Adivi Sesh succeed where other Tier-2 stars failed?

Will Adivi Sesh succeed where other Tier-2 stars failed?

Publish Date:Oct 28, 2025

Adivi Sesh has established himself as a successful star at the box office with his thrillers. He started an unprecendented success streak with Kshanam and continued it with Goodachari, Evaru, Major, HIT: The Second Case. After a four year gap, he is releasing his solo-starrer Dacoit on 19th March, for Ugadi festival.  The movie stars Mrunal Thakur in the leading lady role after Shruti Haasan exited the film. Sesh took time to perfect Uttarandhra slang for the film and the shoot is going on at a slow pace giving more importance to perfection. Well, big festival releases for Tier-2 stars did not yield great results.  Siddhu Jonnalagadda's Telusu Kada released for Diwali and failed to entertain audiences. Similarly, Kiran Abbavaram K-Ramp failed despite good inital push as a youthful entertainer. Vijay Deverakonda had bad results with NOTA and The Family Star being festival releases.  Nani's Dasara became a superhit but he prefers to release most of films away from big competition during festival period around Christmas. Now, Adivi Sesh has boldly looked at Christmas day or Ugadi Day release for Dacoit. Within a week two biggies - Ram Charan's Peddi and Nani's The Paradise are releasing on massive scale.  Hoping for at least two week free run, many of the young actors look to give such gap from big movies. Teja Sajja's Mirai, Bellamkonda Srinivas's Kishkindhapuri released two weeks before Pawan Kalyan's OG. Looking at all these factors, Dacoit seems to be taking a huge risk. Let's see how Adivi Sesh thriller fares for a festival release.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

ఒకే పాత్రను కొన్ని వందల సినిమాల్లో చేసి మెప్పించిన మేటి నటి సూర్యకాంతం!

Publish Date:Oct 28, 2025

(అక్టోబర్‌ 28 నటి సూర్యకాంతం జయంతి సందర్భంగా..) తాము చేస్తున్న సినిమాల్లో ఒకే తరహా పాత్రలు పోషించి మెప్పించడం నటీనటులకు చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ప్రతి సినిమాలోనూ అదే పాత్ర చేయడం వారికి విసుగు తెప్పిస్తుంది కూడా. కానీ, పాతతరం నటి సూర్యకాంతం తన విషయంలో అది కరెక్ట్‌ కాదని నిరూపించారు. గయ్యాళి అత్త అంటే మనకు సూర్యకాంతం గుర్తొస్తారు. ఆ పాత్రకు పేటెంట్‌ హక్కులు పూర్తిగా ఆమెవే. ఆమె పేరు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో అంతలా ముద్రపడిపోయింది. దాదాపు 50 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో 700కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. వాటిలో దాదాపు అన్నీ గయ్యాళి పాత్రలే ఉండడం అనేది గొప్ప విషయం. అలా వరసగా గయ్యాళి పాత్రలు చేసి ప్రేక్షకులకు బోర్‌ కొట్టించని ఏకైక నటి సూర్యకాంతం. ఆమె చేసిన పాత్రల ప్రభావం ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా ఉందంటే సూర్యకాంతం అనే పేరును కూడా తమ పిల్లలకు పెట్టుకునే ధైర్యం ఏ తల్లిదండ్రులూ చెయ్యలేదు. అలాంటి విశిష్టమైన నటి సూర్యకాంతం సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆమె సినీ, జీవిత విశేషాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. 1924 అక్టోబర్‌ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు సూర్యకాంతం 14వ సంతానం. అందరి కంటే చిన్నది కావడంతో ఆమెను ఎంతో గారాబం చేసేవారు. చిన్నతనం నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవారు. తెలుగు కంటే హిందీ సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు. ఆ సినిమాలు చూసి అందులోని పాటలు పాడుతూ ఉండేవారు. సూర్యకాంతం స్కూల్‌లో వేసే నాటకాల్లో నటించేవారు. ఇది తెలిసి తల్లి మందలించినా అవేవీ పట్టించుకోకుండా నాటకాల్లో కొనసాగేవారు. ఆమె 8వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి అనంతరామయ్య కన్నుమూశారు. ఆ తర్వాత కూడా సూర్యకాంతం స్కూల్‌లో నాటకాలు వేశారు. ఆ సమయంలోనే వారి బంధువు ఒకరు హనుమాన్‌ నాట్యమండలి అనే నాటక సంస్థను నడిపేవారు. అందులో అందరూ ఆడవారే ఉండేవారు. దీంతో సూర్యకాంతం కూడా అందులో చేరి సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాబారం వంటి నాటకాల్లో నటించారు.    ఆ సమయంలోనే జెమిని సంస్థవారు తాము నిర్మిస్తున్న చంద్రలేఖ సినిమాలో నూతన నటీనటులు కావాలి అని పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. అది చూసిన సూర్యకాంతం స్నేహితురాళ్లు ఇద్దరు మద్రాస్‌ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వారితోపాటు సూర్యకాంతం కూడా వెళ్లారు. చంద్రలేఖ సినిమాలో ఈ ముగ్గురికీ చిన్న చిన్న వేషాలు ఇచ్చారు. అదే సమయంలో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న నారద నారది చిత్రంలో ఒక క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. ఇది తెలుసుకున్న జెమినివారు తమతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న తర్వాత మరో సినిమాలో నటించడానికి వీల్లేదని చెప్పారు. పుల్లయ్య కూడా పెద్ద డైరెక్టరేనని, ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు సూర్యకాంతం. దీంతో జెమినీవారు సూర్యకాంతంకి ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి అడక్కుండా అగ్రిమెంట్‌ని రద్దు చేసుకున్నారు. అలా 1946లో విడుదలైన నారద నారది చిత్రంలో తొలిసారి నటించారు. ఈ సినిమా తర్వాత 1949 వరకు రత్నమాల, గృహప్రవేశం వంటి కొన్ని సినిమాల్లో నటించారు. నిజానికి సూర్యకాంతం హిందీ సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చారు. అయితే తెలుగులో నటిగా నిలదొక్కుకున్న తర్వాతే హిందీలోకి వెళితే బాగుంటుందని దర్శకుడు సి.పుల్లయ్య ఇచ్చిన సలహాను పాటించి తెలుగులోనే నటిగా కొనసాగారు.    1950లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన సంసారం చిత్రంతో సూర్యకాంతం కెరీర్‌ గొప్ప టర్న్‌ తీసుకుంది. ఈ సినిమాలో మొదటిసారి గయ్యాళి అత్తగా నటించారు. ఆ పాత్ర సూర్యకాంతంకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు సూర్యకాంతంను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నీ ఒకే తరహా పాత్రలే అయినా ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఆదరించారు. పెళ్లిచేసిచూడు, దొంగరాముడు, బ్రతుకు తెరువు, మాయాబజార్‌, తోడికోడళ్లు, మాంగల్యబలం, వెలుగు నీడలు, అప్పుచేసి పప్పుకూడు.. ఇలా దాదాపు 20 సంవత్సరాలపాటు సూర్యకాంతం లేని సినిమా అంటూ ఉండేది కాదు. 1962లో సూర్యకాంతం చేసిన గుండమ్మకథకు చాలా విశేషాలు ఉన్నాయి. అప్పటికే ఎన్‌.టి.ఆర్‌. ఎఎన్నార్‌ తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలు. వారిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాకి సూర్యకాంతం చేసిన గుండమ్మ క్యారెక్టర్‌ను హైలైట్‌ చేస్తూ గుండమ్మకథ అనే టైటిల్‌ని పెట్టడం ఆరోజుల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ప్రతి సినిమాలోనూ గయ్యాళి పాత్ర పోషించినా.. అందులోనే విభిన్నమైన కోణాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. సూర్యకాంతంను తెరపై చూస్తూ తిట్టుకుంటూనే ఆమె సినిమాలను ఎంతో ఆదరించేవారు.  సినిమాల్లో గయ్యాళి పాత్రలు చేసి అందరితోనూ తిట్లు తినే సూర్యకాంతం నిజ జీవితంలో సౌమ్యంగా ఉండేవారు. పెద్దలను గౌరవించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి గొప్ప లక్షణాలు ఆమెలో ఉండేవి. ఆమె షూటింగ్‌కి వెళుతున్నారంటే 20 మందికి సరిపడే భోజనాలు వెంట తీసుకెళ్ళేవారు. తన సహనటీనటులకు, సాంకేతిక నిపుణులకు వాటిని కొసరి కొసరి వడ్డించేవారు. అంతేకాదు, రకరకాల పిండి వంటలు కూడా చేయించి షూటింగ్‌కి తీసుకొచ్చేవారు. అలా సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు వంటి వారు కూడా ఇంటి నుంచి భోజనాలు తెచ్చేవారు. సూర్యకాంతం సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని ఇతర వ్యాపారాలు కూడా చేసేవారు. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతోపాటు బాపు, రమణ తీసే సినిమాలకు ఫైనాన్స్‌ చేసేవారు. అలాగే పాత కార్లు కొని వాటికి మరమ్మతులు చేయించి, పెయింట్‌ వేయించి తిరిగి అమ్మేవారు. ఆరోజుల్లో నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తున్నాయని గ్రహించిన సూర్యకాంతం.. విదేశాల నుంచి క్వాలిటీగా ఉండే మేకప్‌ కిట్‌లను తెప్పించి నటీనటులకు అమ్మేవారు.  ఇక వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే.. సూర్యకాంతం నాటకాలు వేసే రోజుల్లోనే న్యాయవాదిగా పనిచేసే పెద్దిభొట్ల చలపతిరావు కూడా నాటకాల్లో నటించేవారు. ఆయన తెనాలి నుంచి మద్రాస్‌ షిప్ట్‌ అయిన తర్వాత 1950లో చలపతిరావును వివాహం చేసుకున్నారు సూర్యకాంతం. వీరికి సంతానం కలగలేదు. దీంతో తన అక్క సత్యవతి కుమారుడ్ని నెలల వయసులోనే దత్తత తీసుకున్నారు. అతనికి అనంత పద్మనాభమూర్తి అని పేరు పెట్టుకున్నారు. సూర్యకాంతంకి దానగుణం ఎక్కువ. వికలాంగులకు, వృద్ధకళాకారులకు ఆర్థికసాయం చేసేవారు. అలాగే సినిమాల్లో నటించాలని వచ్చి అవకాశాలు రాక ఉన్నదంతా పోగొట్టుకొని ఊరికి వెళ్ళడానికి కూడా డబ్బులేని ఎంతో మందిని సొంత ఖర్చులతో ఊళ్ళకు పంపించేవారు. గ్రంథాలయాలకు, నాటక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకునేవారు కాదు. తిరుపతిలో ఆమె పేరుమీద ఒక కాటేజీ ఉండేది. మూడు వారాలకు ఒకసారి అక్కడికి వెళ్లేవారు. సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ గుడికి తరచూ వెళ్లేవారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం ఒక సత్రం కట్టించారు సూర్యకాంతం.    ఆమె ఎంత సున్నిత మనస్కురాలంటే.. ఒక సినిమాలో నటుడు నాగయ్యను నోటికొచ్చినట్టు తిట్టే సీన్‌ చెయ్యాల్సి వచ్చింది. అది పూర్తవ్వగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన కాళ్ళకు నమస్కరించి క్షమించమని వేడుకున్నారు సూర్యకాంతం. ‘నువ్వు కాదు నన్ను తిట్టింది.. నీ పాత్ర.. దానికెందుకమ్మా బాధపడతావు. ఊరుకో’ అని ఓదార్చారు నాగయ్య. స్యూరకాంతం నవలలు ఎక్కువగా చదివేవారు. ఓ పక్క నటిస్తూనే ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చెయ్యాలనుకున్నారు. ప్రతిరోజూ రాత్రి పూట చదువుకునేవారు. దీని వల్ల పగలు షూటింగులో ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన ఛాయాదేవి ‘నటిగా నీకు ఇంత మంచి పేరు ఉంది. డిగ్రీ ఎప్పుడైనా పూర్తి చెయ్యొచ్చు. సినిమా అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు’ అని సీరియస్‌గా చెప్పడంతో డిగ్రీ చెయ్యాలన్న ఆలోచన మానుకున్నారు సూర్యకాంతం. 50 ఏళ్ల వయసులో మరాఠి, ఫ్రెంచ్‌ భాషలు నేర్చుకున్నారు.  చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకునేవారు సూర్యకాంతం. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించకపోయినా సినిమాలు మాత్రం మానేవారు కాదు. 1990 సంవత్సరం వచ్చేసరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉండేవారు. చివరికి 1994 డిసెంబర్‌ 17న కన్నుమూశారు సూర్యకాంతం. ఆ సమయానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి నివాళులర్పించారు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏమిటంటే.. 50 సంవత్సరాలు నటిగా కొనసాగి, దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరు నటీనటులతో కలిసి నటించిన సూర్యకాంతం చనిపోయారన్న వార్త తెలిసి కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి అంజలీదేవి, జమున, అల్లు రామలింగయ్య, జి.వరలక్ష్మీ, వాణిశ్రీ వంటి పది మంది మాత్రమే వచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎవరైనా వస్తారేమోనని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తన సహజ నటనతో లక్షల మంది ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సూర్యకాంతం ఆత్మకు వారి నివాళే నిజమైన శాంతిని చేకూరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

బాహుబలి లాంటి సినిమాని బాలీవుడ్ తెరకెక్కించగలదా! 

Publish Date:Oct 27, 2025

- బాలీవుడ్ కి ఏమైంది? - భారతీయ చిత్ర పరిశ్రమ ఎవరిది? - బాహుబలి ని బాలీవుడ్ తెరకెక్కించగలదా!   భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు హిందీ చిత్ర పరిశ్రమ. కాకపోతే ఈ డైలాగ్ పాతదయిపోయి జమానా కాలం దాటింది. హిందీ చిత్రరంగం ప్లేస్ లోకి తెలుగు సినిమా వచ్చి చేరింది. ఇందుకు ప్రధాన కారణం మన తెలుగు దర్శకులు తమ మేధస్సుతో సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త కథలకి అంకురార్పణ చేయడమే. దీంతో భారతీయ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా తెలుగు సినిమా చేరుకుంది. బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 ,ఆర్ఆర్ఆర్, పుష్ప పార్ట్ 1 ,పార్ట్  2 , కార్తికేయ 2 , కాంతార, కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)చిత్రాలే ఉదాహరణ. ఇక ఈ నెల 31 న బాహుబలి(Baahubali)రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా రీ రిలీజ్ కాబోతుంది. దీంతో హిందీ చిత్ర పరిశ్రమ తెలుగు సినిమా స్థాయిలోకి  వచ్చే అవకాశం ఉందా అనే చర్చ మరోసారి సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.   హిందీ చిత్ర పరిశ్రమ ప్రారంభం నుంచే కథ, కథనం విషయంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవిడిని సృష్టిస్తూ ముందుకెళ్ళేది. సదరు చిత్రాలు బడ్జెట్ పరంగాను, టెక్నికల్ గాను ఎంతో ఉన్నతంగా ఉండేవి. జోనర్స్ పరంగా కూడా అన్ని జోనర్స్ కి సంబంధించిన కథల్ని ప్రేక్షకులు మైమరిచిపోయేలా తెరకెక్కించేవాళ్ళు. అందమైన పాటలతో పాటు కాస్టింగ్ పరంగాను సంచలనం సృష్టించాయి. ఆయా చిత్రాలని చూసి తెలుగుతో పాటు దక్షిణ భారతీయ మేకర్స్ కూడా ఇన్ స్పైర్ చెందే వారు. మూవీ లవర్స్ కూడా హిందీ సినిమా చూశామని గర్వంతో తమ వారికి చెప్పుకుని మురిసిపోయేవారు. అంతటి  చరిష్మా బాలీవుడ్ సినిమా సొంతం. కానీ హిందీ చిత్ర పరిశ్రమ చాలా ఏళ్ళ నుంచి తన ఉనికిని భారతీయ సినీ యవనికపై చాటడంలో విఫలమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందని అనుకున్నా కూడా ఎప్పటికప్పుడు నాసిరకం సినిమాలు వస్తూనే ఉన్నాయి.   Also read: వివాదంలో ఆది.. క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్    ఈ విషయంలో హిందీ సినీ రంగ ప్రేమికులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా, సబ్జెట్స్ పరంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్నాయి. సదరు చిత్రాలు బాలీవుడ్ లో సైతం ఊహించని రీతిలో అక్కడి చిత్రాలకి కూడా దక్కని విధంగా కలెక్షన్స్  సాధిస్తున్నాయి. దీంతో హిందీ చిత్రపరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమని బీట్ చేయగలదా అని పలువురు  బాలీవుడ్ సినీ పండితులే సోషల్ మీడియా వేదికగా తమ డౌట్ ని వ్యక్తం చేస్తున్నారు.  

కన్నీళ్లు పెట్టుకున్న భావన.. భాను డాన్స్ లో డెప్త్ కాదు విడ్త్ కూడా ఉంది

Publish Date:Oct 28, 2025

కార్తీక మాసం స్పెషల్ గా "కార్తీక వైభోగమే" పేరుతో ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ కార్తీక పౌర్ణమిని స్పెషల్ గా చేసుకోబోతున్నాం అలాగే అక్కాచెల్లెళ్ల సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నాం. ఈ షోకి శ్రీవాణి తన అక్కని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది. ఇక ఢీ డాన్సర్ మహేశ్వరీ ఐతే ఆ నటరాజుడు కలిపినా అక్కచెల్లెళ్ళం మేము అని చెప్పింది. ఇక అందరూ శివలింగానికి క్షీరాభిషేకం చేసి ఆ నందీశ్వరుడి చెవిలో ఎం చెప్తే ఆ కోరిక నెరవేరుతుందని అందరూ వారి వారి కోరికలు కోరుకున్నారు. ఇక భావన ఐతే కన్నీళ్లు పెట్టుకుంది. "ఎందుకు అని రష్మీ అడిగింది" ." నాకు ఒక సొంత అక్క ఉంది. కానీ చాల రోజుల నుంచి మాటలు లేవు. ఇంతమంది అక్కాచెల్లెళ్లను చూసేసరికి బాధ కలిగింది. అక్కను దగ్గర చేసుకుంటే అమ్మ దూరమైపోతుంది. అమ్మను దగ్గర చేసుకుంటే అక్క దూరమైపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలో తెలీట్లేదు" అని ఏడ్చేసింది. ఇక అల్లరి ప్రియుడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేశారు మహేశ్వరి, సత్యశ్రీ, నాటీ నరేష్. "చెప్పవే చిరుగాలి" సాంగ్ కి భానుశ్రీ డాన్స్ చేసింది. వెంటనే రష్మీ "మేడం భాను పెర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా" అని అడిగింది. "డెప్త్ కాదు విడ్త్ కూడా ఉంది" అంటూ ఇంద్రజ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ఇక డాన్సర్స్ అంతా కలిసి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర మహిమను వర్ణిస్తూ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

ఆ హీరోతో రవితేజ క్రేజీ మల్టీస్టారర్..!

Publish Date:Oct 28, 2025

  - టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ - యంగ్ హీరోతో కలిసి రవితేజ డబుల్ ధమాకా   మల్టీస్టారర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ కి అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఓ యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. (Ravi Teja)   కెరీర్ స్టార్టింగ్ లో పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ.. హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఎక్కువగా సోలో సినిమాలే చేస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం చిరంజీవి సినిమా 'వాల్తేరు వీరయ్య'లో ప్రత్యేక పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు రవితేజ ఓ మల్టీస్టారర్ కి సిద్ధమవుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.   రవితేజ, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించే అవకాశముంది అంటున్నారు. ప్రసన్నకుమార్, త్రినాథరావు నక్కిన కలిసి గతంలో రవితేజతో 'ధమాకా' సినిమా చేయడం విశేషం. (Naveen Polishetty)   ప్రసన్నకుమార్ రైటర్ అంటే కామెడీ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రవితేజ కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది రవితేజ-నవీన్ కలిస్తే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది అనడంలో డౌట్ లేదు.   Also Read: పవర్ స్టార్ ఊచకోత.. ఓటీటీలో ఓజీకి దిమ్మతిరిగే రెస్పాన్స్!   ప్రస్తుత సినిమాల విషయానికొస్తే అక్టోబర్ 31న 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు రవితేజ. అలాగే 2026 సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో అలరించనున్నాడు. నవీన్ కూడా 'అనగనగా ఒక రాజు' చిత్రంతో 2026 సంక్రాంతి బరిలో దిగనున్నాడు.  

Rajinikanth to retire after his film with Kamal?

Publish Date:Oct 28, 2025

Superstar Rajinikanth has lost his interest in films after Padayappa/ Narasimha. He stated that he is retiring after Baba, and entering into politics. But he changed those plans and continued to act after Chandramukhi. He even suffered a big health issue but continued to accept films with gaps in between.  He did Sivaji, Enthiran/ Robo, Lingaa, Kabali, Kaala, 2.0, Petta, Darbar, Jailer, Vettaiyan, Lal Salaam, Coolie after Chandramukhi. Now, he is finishing his portions for Jailer 2 and has accepted a film to star alongside Kamal Haasan. The reports state that after his film with Kamal Haasan, he will retire as an actor.  Before his film with Kamal go on floors, he accepted another film with director Sundar C and that will go on floors from February or March, next year. After this project, in the direction of Nelson Dilipkumar, Kamal Haasan and Rajinikanth film go on floors, say reports.  Also, as Kamal had to face a loss of Rs.178 crores due to Thug Life debacle, Rajinikanth has offered to act in both these films for Raaj Kamal Films International. While Sundar C film will be a quick comedy entertainer, Nelson's film will be the biggest multi-starrer ever in Tamil Cinema.  So, daughters of Rajinikanth and Kamal Haasan will produce that film. Well, if the reports are to be believed, it is going to be an end of iconic circle for Rajini. as he started his career with Kamal and director Balachander became guru for both of them.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

బైసన్

Publish Date:Oct 24, 2025

కె ర్యాంప్

Publish Date:Oct 18, 2025

తెలుసు కదా

Publish Date:Oct 17, 2025

డ్యూడ్

Publish Date:Oct 17, 2025

Bison

Publish Date:Oct 24, 2025

k Ramp

Publish Date:Oct 18, 2025

Telusu Kada

Publish Date:Oct 17, 2025

Dude

Publish Date:Oct 17, 2025

Mithra Mandali

Publish Date:Oct 16, 2025