English | Telugu
Bigg Boss 9 Telugu : కళ్యాణ్ ని నామినేట్ చేసిన శ్రీజ.. రీతూ, మాధురి మధ్య ముదిరిన గొడవ!
Updated : Oct 28, 2025
బిగ్ బాస్ సీజన్-9 ఎనిమిదో వారానికి ఎంట్రీ అయింది. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా శ్రీజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వగానే మాధురితో గొడవ మొదలైంది. మీ పేరు మాధురినే కదా నేను బయట కూడా కనుక్కున్నాను చాలా మందికి తెలియదట అని శ్రీజ అనగానే నాక్కూడా మీరు ఎవరో తెలియదని మాధురి అంటుంది. ఆ తర్వాత మీరు హౌస్ లోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం అవ్వడం లేదు.. బాండింగ్ కోసం వచ్చారా అని మాధురిని శ్రీజ అడుగుతుంది.
అవునని మాధురి వెటకారంగా సమాధానం చెప్తుంది. తనూజ నీపై తప్పుడు అలిగేషన్ వేసిన వాళ్ళతో బాండింగ్ పెంచుకుంటావ్ ఎందుకని తనూజని సూటిగా అడుగుతుంది శ్రీజ. అప్పుడే బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీరు నామినేట్ చెయ్యడానికి వచ్చారు. ఆ ప్రక్రియ చెయ్యండి అని శ్రీజకి చెప్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ ని శ్రీజ నామినేట్ చేసి అందరికి ట్విస్ట్ ఇస్తుంది. నిన్ను రమ్య, మాధురి గారు ఇద్దరు కలిసి ఆడోళ్ళ పిచ్చోడు అన్నారు. అది నిజమేనా అని కళ్యాణ్ ని శ్రీజ అడుగుతుంది. లేదని కళ్యాణ్ చెప్పగానే.. మరెందుకు సైలెంట్ గా ఉన్నావ్.. నామినేషన్ లో వాళ్ళని ఎందుకు నామినేట్ చేయ్యలేదు. తనూజని చెయ్యాలని అనుకున్నావ్ కానీ తనని కూడా చెయ్యలేదు.. ఎందుకు తన నామినేషన్ అప్పుడు చెయ్ వెయ్యరా అన్నప్పుడు ఇక ఇద్దరం పాజిటివ్ గా ఉన్నాము.. ఇప్పుడు నామినేట్ చేస్తే నెగెటివ్ అవుతానని చేయలేదా అని శ్రీజ తన పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్తుంది. అలా ఏం కాదు ఆల్రెడీ తనని ఆ పాయింట్స్ మీద అయేషా నామినేట్ చేసింది అందుకేనని కళ్యాణ్ సమాధానం చెప్తాడు.
శ్రీజ ఇంకొకరిని నామినేట్ చేసే ఛాన్స్ మాధురికి ఇస్తుంది. దాంతో రీతూని మాధురి నామిమేట్ చేస్తుంది. టాస్క్ లో మా టీమ్ నుండి వాళ్ళ టీమ్ కి వెళ్లావని రీజన్ చెప్తుంది. దానికి రీతూ, మధురి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఇద్దరిలో ఎవరూ తగ్గకుండా ఆర్గుమెంట్స్ చేసుకున్నారు. కళ్యాణ్ ని శ్రీజ నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్.. ఎందుకంటే కళ్యాణ్ నిబ్బా.. కాబట్టి అతనికేం అర్థం కాలేదు.. అదే శ్రీజ చెప్పింది. రీతూ, మాధురి మధ్య జరిగిన డిస్కషన్ లో ఎవరిది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి.