English | Telugu

లెజెండ్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా లేపలేదు!

జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ దేవిశ్రీప్రసాద్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. "లెజెండ్ ..నువ్వు నాకిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా లేపలేదు నువ్వు నన్ను." అన్నారు జగ్గు భాయ్. థ్యాంక్యూ సర్ అన్నాడు డిఎస్పీ. "నాన్న గారు రాసిన పాట తెలీదు కానీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు రాసిన పాట మాత్రం బాగా తెలుసు" అని జగ్గూభాయ్ అనేసరికి "ఎం పాట సర్ అది" అంటూ డిఎస్పీ రివర్స్ లో ఆయన్నే అడిగారు. వెంటనే "నిన్ను చూడగానే చిట్టి గుండె" సాంగ్ ప్లే అయ్యింది బ్యాక్ గ్రౌండ్ లో. "రోడ్డు మీద అనుకోకుండా వచ్చిన పాట సర్ ఇది. ఈ లైన్ పడేసరికి ఇటు నుంచి ఇంకో అమ్మాయి వెళ్తోంది. సరదాగా కళ్యాణ్ గారిని పిలిచి ఈ పాటను వినిపిద్దామా అని అంటే వీడు ఆరడుగుల బుల్లెట్టు అని పాడి అక్కడ ఒక కెమెరా స్టాండ్ ఉంది.

అది తీసి ఒక గన్ లా ధడ్ ధడ్ ధడ్ అని "చెప్తూ నవ్వేసాడు. "మళ్ళీ లవ్ స్టోరీలకు వస్తే" అంటూ జగ్గు భాయ్ అనేసరికి "మీరు మీ ఇంటర్వ్యూ అనుకుంటున్నారేమో సర్ ఇది నా ఇంటర్వ్యూ సర్" అంటూ కౌంటర్ వేసాడు డిఎస్పీ. "రొమాంటిక్ బాయ్" అంటూ జగ్గు భాయ్ కి కాంప్లిమెంట్ ఇచ్చాడు డిఎస్పీ. "ఫస్ట్ రాసిన పాట పాడితే బాగుంటుంది" అని జగపతి బాబు అనేసరికి వెంటనే డిఎస్పీ తన బ్యాండ్ తో రెడీగా ఉన్నాడు. "లెట్స్ గో ఏ నీయొక్క అందం చూసి" అంటూ ఒక సాంగ్ పడేసరికి జగ్గు భాయ్ ఫిదా ఐపోయి క్లాప్స్ కొట్టారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.