English | Telugu
Bigg Boss 9 Telugu : రీతూకి ఇచ్చిపడేసిన ఫ్లోరా.. సుమన్ శెట్టి బెస్ట్ నామినేషన్!
Updated : Oct 28, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ లోకి ఫ్లోరా సైనీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తను రీతూని నామినేట్ చేసింది. నువ్వు హౌస్ లోకి ఒక పర్పస్ తో వచ్చావ్.. ఇక్కడ ఒక లవ్ స్టోరీ నడిపోతే ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్న ఆలోచనలో ఉన్నావ్.. అంతేకాకుండా ఎలాంటి బాండ్ లేని సంజన కోసం హెయిర్ కట్ చేసుకున్నావ్ కానీ నీతో మంచి బాండ్ ఉన్న డీమాన్ పవన్ కి టాస్క్ లో మనీ ఇవ్వలేదు.
అలా సంజన గురించి హెయిర్ కట్ చేసుకుంటే ఓట్స్ పడుతాయని అలా చేసినట్టు అనిపించిందని ఫ్లోరా తన పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్పింది. రీతూ కూడా డిఫెన్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ కి సుమన్ శెట్టికి ఛాన్స్ ఇస్తుంది ఫ్లోరా. దాంతో సంజనని సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. మీరు హౌస్ లో అనే మాటలు బాగుండడం లేదు.. మీకు మాటలు అనడం అలవాటు అయింది.. మాకూ వినడం అలవాటు అయిందని సుమన్ శెట్టి చెప్తాడు. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు డిస్ రెస్పెక్ట్ తో చూసారు.. నన్ను తొక్కలో కెప్టెన్ అన్నారని సుమన్ శెట్టి చెప్పాడు.
దానికి సారీ చెప్పాను కదా అని సంజన చెప్పగానే.. మిమ్మల్ని లాగి పెట్టి కొట్టి సారీ అంటే ఊరుకుంటారా అని సుమన్ అంటాడు. సుమన్ తన పాయింట్స్ ని చాలా క్లారిటీగా చెప్పాడు. నేను సారీ చెప్పాను కదా మళ్ళీ మీరే హైలైట్ చేసుకుంటున్నారని సంజన అనగానే.. ఇది నా బాధ.. ఇది మీకేందుకు అర్థం కావడం లేదని సుమన్ శెట్టి తన పాయింట్స్ తో కరెక్ట్ గా మాట్లాడతాడు. కాసేపు ఇద్దరు ఆర్గుమెంట్స్ చేసుకుంటారు. సుమన్ శెట్టి వ్యాలిడ్ రీజన్ తో నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి నామినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.