English | Telugu
ఇండస్ట్రీకి కొత్త యాంకర్..భయంతో శ్రీముఖి
Updated : Oct 28, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అందమైన అమ్మాయిలతో జరుపుకునే కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ గా దీన్ని టెలికాస్ట్ చేయబోతున్నారు. పండగ రోజు వీళ్ళ కట్టు, బొట్టు అందం చూస్తుంటే కొలికేయాలనిపిస్తోంది, కొలికేయాలనిపిస్తోంది అంటూ చెప్పింది శ్రీముఖి. ఇక ఈ షోకి సుహాసిని ఫుల్ బుట్టబొమ్మలా రెడీ అయ్యి వచ్చింది. "పండగ రోజు నువ్వు మీ ఆయన ఎం చేస్తారో చెప్పు" అంటూ శ్రీముఖి అడిగింది. దానికి అవినాష్ ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్న లేవగానే డజన్ రైస్ పెడుతుంది." అనేసరికి శ్రీముఖి వెంటనే "లీటర్ కర్రీ వండుద్ది" అనేసరికి సుహాసిని షాకైనట్టుగా ఒక ఫేస్ పెట్టింది. ఇక కార్తీక దీపం 2 లో నటిస్తున్న గాయత్రి కూడా వచ్చింది. వెంటనే శ్రీముఖి ఆమె దగ్గరకు వెళ్లి "నీకు ఎలాంటి హజ్బెండ్ కావాలి చెప్పు" అని అడిగింది. "శ్రీముఖికి ఎలాంటి హజ్బెండ్ ఐతే వస్తాడో నాకు అలాంటి హజ్బెండ్ కావాలి " అని చెప్పింది. దాంతో శ్రీముఖి భయపడిపోయి "ఓరి నాయనో ఇది నా మొగుడి మీద కన్నేసేటట్టుందిరా" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక కావ్య శ్రీముఖిని చూసి "ఏంటి నీకు నిజంగా అబ్బాయి కావాలా" అని అడిగింది చిరాకు మొహంతో.
దాంతో శ్రీముఖి ఎం చెప్పాలో తెలీక నవ్వేసింది. ఇక ఈ ఎపిసోడ్ కి సిరి హన్మంత్ ఫస్ట్ టైం వచ్చింది. ఆ విషయాన్నీ శ్రీముఖి చెప్పింది. "సిరి బిజినెస్ ని చూసుకుంటుంది అని విన్నాను. ఎందుకు ఇట్లా చేస్తున్నావ్ నువ్వు" అనేసరికి "నో ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ " అంటూ రోహిణి ఆన్సర్ ఇచ్చింది. అలాగే సమీర్ భరద్వాజ్ కూడా ఈ షోకి వచ్చింది. "ఇన్నాళ్లు మీరు ఆమెలో సింగర్ ని, ఎంటర్టైనర్ ని మాత్రమే చూసారు. కానీ ఇండస్ట్రీకి కొత్త యాంకర్ వచ్చింది" అంటూ ఆమె గురించి గొప్పగా ఎలివేషన్ ఇచ్చింది. "ఇది చదరంగం కాదు రణరంగమే" అంటూ సమీరా బిగ్ బాస్ డైలాగ్ చెప్పింది. "ఈ డైలాగ్ మా హరి రాసాడు" అంటూ శ్రీముఖి సమీరాకి చెప్పింది.