English | Telugu

ఎందుకు ఈ బెదిరింపులు! మనమంతా ఒకటేగా 

- బెదిరింపులు ఎందుకు!
- రజనీ చిటికేస్తే ఏమవుతుంది
- రజనీ, ధనుష్ ఇళ్ళకి బాంబు బెదిరింపులు
- పోయస్ గార్డెన్ లో తనిఖీలు

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)ఏది చెప్తే అది చెయ్యడానికి తమిళనాడులోని ఆయన అభిమానులు ఎంతవరకైనా వెళ్తారు. అసలు రజనీ ఒక చిటిక వేస్తే చాలు తమిళనాడు మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది. రజనీ చరిష్మా కి కొలమానం అంటు కూడా లేదు. స్టార్ హీరో ధనుష్(Dhanush)కి కూడా తమిళనాడు వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. రజనీకి మాజీ అల్లుడు అయినా ఇప్పటికి రజనీ అంటే ఎంతో అభిమానాన్ని చూపిస్తాడు.

ఈ రోజు ఉదయం చెన్నై(Chennai)డిజీపీ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. అందులో పోయస్ గార్డెన్(Poes Garden)లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇంటికి బాంబులు పెడుతున్నామని రాసి ఉంది. దీంతో డాగ్ స్క్వాడ్ బృందాలు ఆ ఇద్దరి ఇళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసారు. ఆ తర్వాత ఆ ప్రాంగణం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఎంక్వ యిరీ చేస్తున్నారు.

Also read: చిన్నప్పటి ప్రభాస్ గా మహేష్ బాబు మేనల్లుడు

కొన్ని రోజుల క్రితం త్రిష(Trisha)ఇంటికి కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా సినీ తారల ఇంటికి వరుస బెదిరింపులు రావడం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారనే చర్చ కూడా అందరిలో జరుగుతుంది.