English | Telugu

ఈ నెల 11తో  విజయశాంతి బాటలోకి కాజల్ వెళ్లనుందా? 

కాజల్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం సత్య భామ. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఈ నెల 11 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆల్రెడీ 60 % కి పైగా చిత్రీకరణని జరుపుకున్న సత్యభామ మూవీ ని మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన కాజల్ స్టిల్స్ కొన్ని బయటకి వచ్చి సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలని పెంచాయి.

2007 లో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరంగా ఉంటు వస్తున్న కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఇటీవలే బాలకృష్ణతో భగవంత్ కేసరి మూవీలో నటించి అందర్నీ మెప్పించింది.ఈ నెల 11 న విడుదల అవుతున్న సత్యభామ టీజర్ ద్వారా కాజల్ ఏం చెప్పబోతుందో అని అందరు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొంతమంది అయితే కాజల్ విజయశాంతి బాటలోకి వెళ్లి టైటిల్ రోల్స్ క్యారక్టర్లనే ఇకపై చేస్తుందేమో అని అనుకుంటున్నారు శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సత్య భామ మూవీ ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు నిర్మిస్తుండగా సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు.