English | Telugu
వేసవి ముగింపును టార్గెట్ చేసుకున్న రౌడీ స్టార్-సమంత!
Updated : Jan 9, 2023
ఒకవైపు నాగచైతన్యతో విడాకులు, మరోవైపు మయోసైటీస్ అనే అరుదైనవ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ సమంత ఎట్టకేలకు ముంబై ఎయిర్ పోర్ట్‌లో కెమెరా కంటికి దొరికింది. ఒత్తిడి, చికిత్సల కారణంగా ఆమె బాగా సన్నబడినట్లు అర్థమవుతోంది. ఇక మొహంలో మునుపటి కళ తగ్గినట్లు కనిపించింది. మరి అది మేకప్పా, లేక అనారోగ్యం వలన వచ్చిన మార్పా అనేది తెలియడం లేదు. కళ్ళలోని భావాలు తెలియకుండా గాగుల్స్ ధరించింది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో చాలా సీరియస్‌గా కనిపిస్తోంది. అక్కడ కెమెరామెన్ ఆమెకు న్యూ ఇయర్ విషెస్ చెప్పినా కూడా ఆమె పట్టించుకోలేదు.
సాధారణంగా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సమంత ఇక్కడ మాత్రం చాలా పరాకుగా అసహనంగా కనిపించింది. ఇంతకీ ఆమె ముంబైకి వెళ్లడానికి కారణం ఏమిటి? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆమె 'ఫ్యామిలీమేన్' వెబ్ సిరీస్డైరెక్టర్స్ అయిన రాజ్-డీజేదర్శకత్వంలో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దాంట్లో ఆమె నటించడం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నటించేందు కోసమే ఆమె ముంబైకి వచ్చిందని మీడియా వారుఅంటున్నారు.
మరోవైపు కరణ్ జోహార్‌తో పాటు పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సమంతతో చిత్రాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. ఇక సమంత ప్రస్తుతం తెలుగులో 'శాకుంతలం', 'ఖుషీ' చిత్రాలను చేస్తోంది. 'శాకుంతలం' మూవీ రిలీజ్ డేట్‌ను ఇటీవల నిర్మాతదిల్ రాజు అధికారికంగా ప్రకటించేశారు. ఫిబ్రవరి 17న 'శాకుంతలం' విడుదల కానుంది.
ఇక సమంత నటిస్తున్న మరో తెలుగు చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని వాస్తవానికి 2022 డిసెంబర్‌లోనే విడుదల చేయాలని భావించారు. కానీ సమంత అనుకోకుండా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో అయినా 'ఖుషీ' సినిమాను విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా సమంత ఇంకా షూటింగ్‌కు రాలేదు. ఈ క్రమంలో త్వరగా మిగిలిన షూటింగ్ పూర్తి చేసి సినిమాను వేసవి హంగామా ముగిసే సమయంలో అంటే మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ సమయంలో చాలా పెద్ద సినిమాల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
అసలే 'ఖుషీ' సినిమా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలవుతోంది. దాంతో పోటీ తక్కువగా ఉండే సమయంలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ చిత్రం అటు సమంతాకు, ఇటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు చాలా కీలకమైన చిత్రంగా మారింది. విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ఈ రౌడీ స్టార్ పాన్ఇండియా రేంజిలో సక్సెస్ అందుకోవాలని 'లైగర్' సినిమాతో కష్టపడ్డాడు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. పలు ఆర్థిక ఆరోపణలలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఆఖరికి విజయ్‌ని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గంటల కొద్దీ ప్రశ్నించారు. పారితోషికం ఎంత తీసుకున్నావు? దానిని ఏ రూపంలో తీసుకున్నావు?.. అని ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
ఇలాంటి సమయంలో సమంత తోడుగా విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ సక్సెస్‌ను 'ఖుషి నుండి' ఆశిస్తున్నాడు. మరి ఈ 'ఖుషి' సినిమా విజయ్ దేవరకొండతో పాటు సమంత కష్టాలను కూడా తీర్చి.. వారిద్దరిని కృషికి తగ్గట్లుగా ఖుషీ చేసి విజయంతో మైమరిపిస్తుందో లేదో చూడాలి...!