English | Telugu

మొన్న బి. గోపాల్.. నిన్న బోయపాటి.. నేడు గోపీచంద్!

నందమూరి నట‌సింహ బాలకృష్ణను హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. ఆయనకున్న మాస్ ఇమేజ్ మరెవ్వరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన చిత్రాలు అంత పవర్ఫుల్‌గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. గతంలో ఈ మ్యాజిక్‌ను డైరెక్టర్ బి. గోపాల్ చేసి నిరూపించారు. బాలయ్యతో ఆయన 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ఇక తరువాత వంతు బోయపాటి శ్రీనుది. ఇప్పటికే ఆయ‌న బాల‌య్య‌తో'సింహా', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలతో హ్యాట్రిక్ మూవీస్ తీశాడు. ఇప్పుడు వంతు గోపీచంద్ మ‌లినేనిది. ఈయన గతంలో రవితేజతో 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి హ్యాట్రిక్ హిట్ మూవీస్ తీశారు.

వీటితో పాటు వెంకటేష్ హీరోగా 'బాడీగార్డ్', రామ్ తో 'పండగ చేస్కో', సాయిధరమ్ తేజ్‌తో 'విన్నర్' చిత్రాలను తీసినా పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం రవితేజ చిత్రాలతో తన ఇమేజ్‌ని బాగా పెంచుకున్నారు. మాస్ యాక్ష‌న్ చిత్రాలను బాగా తెరపైకి తేగలరని పేరు సంపాదించారు. దాంతో ఇప్పుడు గోపీచంద్ మలినేనికి వీరసింహారెడ్డి సినిమా బాధ్యతలు అప్పగించారు బాలయ్య.

ఈ సినిమాలో బాలయ్యను గోపీచంద్ ఎలా హ్యాండిల్ చేస్తాడా అని అందరూ భయపడాల్సి వచ్చింది. కానీ బాలయ్యను గోపీచంద్ మలినేని అత్యద్భుతంగా హ్యాండిల్ చేశాడని తెలుస్తోంది. గోపీచంద్ కూడా బోయపాటి, బి. గోపాల్‌రూట్‌లోనే బాలయ్యతో సినిమా చేసినట్టు అనిపిస్తుంది. మాస్ సినిమాల్లో ఉన్న తన పట్టుని బాలకృష్ణకి సరిగ్గా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశాడట. అందులోను గోపీచంద్ మల్లినేని.. బాలకృష్ణ వీరాభిమాని. దాంతో ఆయన ఈ చిత్రం కోసం మరింత జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణని గోపీచంద్ ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆయన ఈ ట్రైలర్‌నినింపి వేశాడు. కథను మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఈ సినిమాలో బాలయ్య డైలాగులే ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయని ట్రైలర్ ద్వారా మనకు అర్థమవుతుంది. దాంతో అస‌లే సంక్రాంతి.. బాల‌య్య ఆక‌లిగొన్న సింహంలా ఉన్నాడు. మ‌రి వారి ఆక‌లిని గోపీచంద్ మ‌లినేని తీర్చి సంతృప్తి ప‌ర‌చ‌గ‌ల‌డా? అనే ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం దొరికింది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

బి.గోపాల్‌, బోయ‌పాటిల ఫార్ములాతోనే గోపీచంద్ కూడా బాలయ్యను 'వీరసింహారెడ్డి'గా తీసినట్టు తెలుస్తోంది. అసలే సంక్రాంతికి మెగాస్టార్ 'వాల్తేర్ వీరయ్య'గా దిగుతున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే 'వాల్తేరు వీర‌య్య'కుబాబీ దర్శకుడు. గతంలో బాబీ రచయితగా గోపీచంద్ చిత్రాలకు పనిచేశాడు.అలా చూసుకుంటే బాలయ్యతో గోపీచంద్ సినిమా చేస్తుంటే చిరుతో బాబీ సినిమా చేస్తున్నారు. ఈ రెండూ నువ్వా నేనా అన్నట్లు బరిలో ఉన్నాయి. 'వాల్తేరు వీరయ్య'కు 'వీరసింహారెడ్డి' గట్టిగా పోటీ ఇవ్వకపోతే నందమూరి ఫ్యాన్స్‌ను గోపీచంద్ తట్టుకోవ‌డం కష్టం. బి. గోపాల్, బోయపాటి త‌ర‌హాలోనే బాలయ్యతో గోపీచంద్ మాస్ హిట్ కొడితే బాలయ్య ప‌ర్మినెంట్ డైరెక్ట‌ర్ల లిస్టులో గోపీచంద్ కూడా చేరుతాడు. ఆయనకు కూడా ఇకపై అవకాశాలు ఇవ్వడానికి బాలయ్య సిద్ధపడతారు.

'వీరసింహారెడ్డి'కి బజ్ అయితే ఓ రేంజ్‌లో ఉంది. సినిమాకు తమన్ అందించినసంగీతం మరో హైలెట్ కానుంది. ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులకు బాగా కిక్కిచ్చాయి. వీటికి తోడు పవర్ఫుల్ డైలాగ్స్‌కులోటు లేకుండా ర‌చ‌యిత సాయిమాద‌వ్ బుర్రా చూసుకున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా శ్రుతి హాసన్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుంది. కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ విలన్ గా చేశాడు. మరి ఈ సంక్రాంతికి బాల‌య్య‌తో క‌లిసి గోపీచంద్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూద్దాం.