English | Telugu

రవితేజ విధ్వంసం గురించి  రేపు చెప్తాం

మాస్ మహారాజా రవితేజ వన్ మాన్ షో టైగర్ నాగేశ్వరరావు మూవీ ఇటీవలే విడుదల అయ్యి ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు రవితేజ ఇంకో పవర్ ఫుల్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఆ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ ని మేకర్స్ వెల్లడిచేయ్యడంతో రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు.

రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఈగిల్ . ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఎప్పుడు విడుదల చేసేది రేపు చెప్తామని మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి మరి ప్రకటించారు. ఈగిల్ మూవీ ప్రకటించినప్పటి నుంచి రవితేజ అభిమానులతో పాటు, సినీ అభిమానుల్లో కూడా ఈగిల్ మీద భారీ అంచనాలే ఉన్నాయి.

రవి తేజ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ . సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానుంది. న‌వ‌దీప్, సీనియర్ హీరోయిన్ మధుబాల ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.