English | Telugu
కార్తిక్ సుబ్బరాజ్ డైరక్షన్‌లో వెంకీ సినిమా!
Updated : Nov 5, 2023
విక్టరీ వెంకటేష్ జోరు పెంచారు. ఆయన ఎక్కడుంటే అక్కడ వాతావరణాన్ని సందడిగా మారుస్తున్నారు. కామన్‌గా ఆడియో వేడుకలకు దూరంగా ఉంటారు వెంకటేష్. కానీ ఈ మధ్య తరచూ ఏదో ఒక ఫంక్షన్‌లో కనిపిస్తున్నారు. లేటెస్ట్‌గా జిగర్తండ డబుల్ ఎక్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు విక్టరీ వెంకటేష్. అందులో గొప్పేం లేకపోయినా, స్టేజ్ మీద విక్టరీ వెంకటేష్ అనౌన్స్ చేసిన ఓ మాట మాత్రం క్రిటిక్స్‌ని ఆకట్టుకుంటుంది.
కార్తిక్ సుబ్బరాజ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయాలని ఉందని, త్వరలోనే అది సాధ్యమవుతుందని ఓపెన్ అయ్యారు విక్టరీ వెంకటేష్. కార్తిక్ సుబ్బరాజ్ కూడా తెలుగులో పనిచేయాలని ఉందనే మాటను చెప్పారు. ఆయన బావమరిది, జిగర్తండ డబుల్ ఎక్స్ నిర్మాత కూడా ఈ విషయాన్ని చూచాయగా ప్రస్తావించారు. కార్తిక్ సుబ్బరాజ్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తే చూడాలని ఉందని, ఆ సినిమాతో తాను ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడతానని అన్నారు.
దీన్నిబట్టి, కార్తిక్ సుబ్బరాజ్ డైరక్షన్‌లో విక్టరీ వెంకటేష్ నటించే సినిమాను ఆయన బావమరిది ప్రొడ్యూస్ చేయొచ్చనే మాట వైరల్ అవుతోంది. రజనీకాంత్‌ని కార్తిక్ సుబ్బరాజ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన తీరు వెంకటేష్‌కి చాలా నచ్చిందట. అంటే, అదే తరహా సబ్జెక్టుతో ఈ డ్యుయో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.